Begin typing your search above and press return to search.
బేతాళుడు చెట్టు ఎక్కేసినట్లేనా?
By: Tupaki Desk | 4 Dec 2016 7:30 AM GMTమ్యూజిక్ డైరెక్టర్ కం హీరో విజయ్ యాంటోనీ నటించిన బిచ్చగాడు మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ అవడంతో.. కోలీవుడ్ మూవీ సైతాన్ ను.. తెలుగులో భేతాలుడు పేరుతో తీసుకొచ్చేశారు. ఒక్క సినిమాకే తమిళ్-తెలుగు వెర్షన్స్ ను ఒకేసారి తీసుకొచ్చేసే స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు విజయ్ యాంటోనీ. అయితే.. కాన్సెప్ట్ బాగున్నా.. దాన్ని కనెక్ట్ చేయడంలోను.. ఇంటర్వెల్ తర్వాత కంటిన్యూ చేయడంలోను తడబడ్డం.. సినిమా కలెక్షన్స్ ను బాగానే దెబ్బకొట్టినట్లుగా కనిపిస్తోంది.
కరెన్సీ నోట్ల రద్దు దెబ్బ.. అందులో ఫస్ట్ తారీఖులంటే జనాలకి డబ్బుల అవసరం బాగా ఉంటుంది. ఆ టైంలో వచ్చిన భేతాళుడుని తెలుగు ఆడియన్స్ పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. మొదటి రోజున 1.34 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రెండో రోజున 60లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం రెండు రోజులకు గాను.. 1.94 కోట్లు తెలుగు వెర్షన్ నుంచి వచ్చాయి. వీకెండ్ ముగిసేసరికి 3 కోట్లు రాబట్టడం ఈజీనే అయినా.. ఈ చిత్రం తెలుగు వెర్షన్ రైట్స్ ను 5 కోట్లకు విక్రయించిన విషయం మర్చిపోకూడదు.
బిచ్చగాడు మ్యాజిక్ ని రిపీచ్ చేయడం సంగతి పక్కన పెడితే.. భేతాళుడు సేఫ్ గా ఒడ్డుకు చేరడం కూడా కష్టం అనేట్లుగా ఉంది పరిస్థితి అంటున్నారు ట్రేడ్ జనాలు. ఇప్పుడున్న టాక్.. కలెక్షన్స్ చూస్తే.. ఈ భేతాళుడు తిరిగి చెట్టెక్కయ్యక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/