Begin typing your search above and press return to search.

భేతాళుడు.. అలా బతికిపోయాడు..

By:  Tupaki Desk   |   9 Dec 2016 6:13 AM GMT
భేతాళుడు.. అలా బతికిపోయాడు..
X
రీసెంట్ గా రిలీజ్ అయిన భేతాళుడు.. అంచనాలను అందుకోలేకపోయాడు. విజయ్ యాంటోనీ హీరోగా.. తమిళ్ లో సైతాన్ గా వచ్చిన ఈ చిత్రం.. తెలుగులో భేతాళుడుగా రిలీజ్ అయింది. బిచ్చగాడు ఎఫెక్ట్ తో.. తెలుగులో కూడా ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడినా.. అవి రీచ్ కావడంలో మూవీ ఫెయిల్ అయింది.

బిచ్చగాడు చిత్రాన్ని 40లక్షలకు తెలుగు రైట్స్ విక్రయిస్తే.. భేతాళుడుకి ఏకంగా 2 కోట్లు పెట్టాల్సి వచ్చింది. అయినా సరే.. ఈ చిత్రానికి సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే దక్కాయి. ఆ తర్వాత మాత్రం వసూళ్లు స్లో అయిపోయాయి. భేతాళుడు తెలుగు వెర్షన్ నిర్మాతలకు నష్టాలు తప్పవనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ విజయ్ యాంటోనీ ఈ చిత్రాన్ని శాటిలైట్ రైట్స్ ఒడ్డెక్కించేశాయి. ఏకంగా రూ. 1.3 కోట్లకు తెలుగు శాటిలైట్ అయిందంటే.. ఈ చిత్రంపై ఛానళ్ల జనాలకు ఉన్న నమ్మకం అర్ధం అవుతుంది.

ఈ ఏడాది శాటిలైట్ టీఆర్పీలలో బిచ్చగాడు రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. భేతాళుడుకి కూడా మంచి రేటింగులే వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉండడంతోనే.. ఈ మూవీ హక్కులను 1.3 కోట్లకు జీ తెలుగు కొనుగోలు చేసేసింది. అయితే.. ఈ డీల్ రిలీజ్ కి ముందే జరిగినది కావడం గమనించాల్సిన విషయం..