Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ సినిమాలో ఆ హీరో లేడనుకుంటే బెటర్!
By: Tupaki Desk | 13 May 2020 2:30 PM GMTఅక్కినేని ఫ్యామిలీలో మూడోతరం హీరో సుశాంత్. 2008లో విడుదలైన కాళీదాసు సినిమాతో హీరోగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కానీ ఆ సినిమా విజయం అందుకోలేక పోయింది. ఆ తర్వాత 2009లో 'కరెంట్' సినిమాతో ఫస్ట్ హిట్ అందుకున్నాడు. మంచి లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ సినిమా.. ఆడియో పరంగాను హిట్ అయింది. ఇక ఆ తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుంటూ.. 2013లో అడ్డా.. 2016లో ఆటాడుకుందాంరా సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేక పోయాయి. వరుస ప్లాప్ లలో ఉన్న సుశాంత్.. సినిమాలకి బ్రేక్ తీసుకొని కథను నమ్మి నటించిన సినిమా 'చిలసౌ'. 2018లో హీరో రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సుశాంత్ నటనకు ప్రశంసల వర్షం కురిసిందని చెప్పాలి. చిలసౌ సినిమా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఆ సినిమా విజయం అందించిన జోష్ లో మళ్లీ మంచి కథ కోసం ఎదురుచూసి "ఇచట వాహనాలు నిలుపరాదు" అనే సినిమా ఓకే చేసాడు.
ఈ సినిమా మొదలయ్యే ముందు డైరెక్టర్ త్రివిక్రమ్ ''అల వైకుంఠపురంలో'' సినిమాలో ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్రకోసం సుశాంత్ ని ఓకే చేసాడు. త్రివిక్రమ్ సినిమా అంటే కాస్తో కూస్తో పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాలో సుశాంత్ పాత్ర చూసి ఎంతో మంది నిరాశకు గురయ్యారు. అక్కినేని ఫ్యాన్స్ అయితే.. హిట్ అందుకున్న హీరోను తీసుకొచ్చి ఎలాంటి నటనకు గాని, పాత్ర నిడివికి గాని, డాన్స్ డైలాగ్స్ ఇలా దేనికి స్కోప్ లేని పాత్ర ఇచ్చారని వాపోయారు. కేవలం హీరో పైనే కాకుండా మిగిలిన పాత్రలు కూడా బలంగా రాసి ఉంటే సుశాంత్ కి కూడా హెల్ప్ అయ్యేదని అంటున్నారు. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్.. సుశాంత్ కి ఎలాంటి ప్రాధాన్యత లేని పేలవమైన పాత్రను రాసి.. ఏ విధంగాను మెప్పించలేక పోయారు. మొత్తానికి 'అల వైకుంఠపురంలో' సినిమాలో సుశాంత్ నటించాడని మర్చిపోతే బెటర్ అని ఫ్యాన్స్ అంటున్నారు. సుశాంత్ ప్రస్తుతం 'ఇచట వాహనములు నిలుపరాదు' సినిమాతో త్వరలో తెరమీదకి రావడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.