Begin typing your search above and press return to search.
‘మా’ ఎన్నికల్లో జోరుగా బెట్టింగ్
By: Tupaki Desk | 9 Oct 2021 10:42 AM GMTమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేళ గెలుపు కోసం సినీ ప్రముఖులు ఎంతదాకా అయినా కొట్లాడుతున్నారు. రేపే ఎన్నికలు కావడంతో హోరాహోరగా ప్రచారం.. ప్రమోషన్లు చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో బెట్టింగులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇన్నాళ్లు రాజకీయాలు, క్రికెట్ కు , కోళ్ల పందేలాకు మాత్రమే పరిమితమైన ఈ బెట్టింగ్ రాజకీయాలు ఇప్పుడు ‘మా’ ఎన్నికలకు కూడా వ్యాపించాయి. ఇప్పుడు ఇందులోనూ బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు.
రేపే మా ఎన్నికలు.. ఈసారి కనీవినీ ఎరుగని స్థాయిలో మా ఎన్నికలకు హైప్ వచ్చింది. ప్రకాష్ రాజ్, విష్ణు మధ్య పోటీ రసవత్తరంగా సాగబోతోంది. వీళ్లలో గెలుపు ఎవరిదో చెప్పడం కష్టమేనంటున్నారు. ఎవరు గెలిచినా 50 ఓట్ల మెజార్టీకి మించి ఉండదంటున్నారు.
ప్రస్తుతం గెలుపు విష్ణుదా? ప్రకాష్ రాజ్ దా? అనే విషయంలో ఫిల్మ్ నగర్ లో జోరుగా బెట్టింగ్ సాగుతోంది. నటీనటులు, దర్శకులు, కొంతమంది నిర్మాతలు, లోపాయికారిగా బెట్టింగ్ వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అధ్యక్షుడు ఎవరన్న విషయంలో మాత్రమే కాదు.. ఏ ప్యానల్ నుంచి ఎవరు గెలుస్తారు? అంటూ మిగిలిన వాళ్లపైనా బెట్టింగ్ మొదలెట్టేసినట్టు తెలుస్తోంది.
ఈసారి ఓ ప్యానల్ నుంచి పోటీచేస్తున్న సభ్యుడు తన గెలుపుపై అతి నమ్మకంతో లక్షల కొద్దీ బెట్ వేసినట్టు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంగ్రామం మొదలైన రోజుల్లో ప్రకాష్ రాజ్ గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారంతా.. కానీ విష్ణు అనూహ్యంగా రేసులోకి వచ్చాడు.
ఓ దశలో విష్ణుదే గెలుపు ఖాయం అని అనుకున్నారంతా.. అయితే విష్ణు ప్యానెల్ లో కొన్ని తప్పులు జరగడం.. మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ ఇచ్చిని ‘ప్రకాష్ రాజ్ ను గెలిపిస్తా’ అంటూ శపథం చేయడంతో సమీకరణాలు మారాయి. ఈ క్రమంలోనే ‘మా’ ఎన్నికలపై ఇప్పుడు జోరుగా పందాలు నడుస్తున్నాయి.