Begin typing your search above and press return to search.
కిలాడీ లేడీస్ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త!
By: Tupaki Desk | 20 Jan 2023 11:30 AM GMTకాస్టింగ్ కాల్ డైరెక్టర్ మాట్లాడుతున్నా..! అంటూ అమ్మాయి నుంచి ఫోన్ వస్తుంది. ఆమె మాట తీయగా పదునుగా ఉంటుంది. ఫలానా హీరో మేనేజర్ పేరుతో ఇంకో అమ్మాయి పరిచయమైపోతుంది. కాస్టింగ్ కావాలని మధురమైన స్వరంతో అడుగుతుంది. డైరెక్టర్ పేరుతో మరో ఫోన్ కాల్ వస్తుంది. కొత్త సినిమా ఆడీషన్ ఉంది అని పిలుస్తారు.
అంతేకాదు.. ఇదిగో ఇదే మా లొకేషన్ అంటూ ఒక గూగుల్ లొకేషన్ లింక్ కూడా పంపుతారు. నిజమే కదా అని నమ్మి వెళ్లారో జేబు గుల్ల చేయడం గ్యారెంటీ. సినిమా అవకాశాల పేరుతో నిరంతరం ఏదో ఒక మూల మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి ఉప్పల్ లో వెలుగు చూసింది.
సదరు కాస్టింగ్ కాల్ డైరెక్టర్ (లేడీ) బోడుప్పల్ నుంచి ఫోన్ చేస్తున్నానని ఇటీవల ఓ ఆర్టిస్టుకు లొకేషన్ పంపింది. ఇది నిజమేనని నమ్మి అక్కడికి వెళ్లి చూడగానే ఒక బేకరిలో కూర్చో బెట్టి ఆర్టిస్టు వివరాలకు సంబంధించిన ఫామ్ పిలప్ చేయించింది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్.. ఆర్టిస్ట్ కార్డు కావాలి.. లేకపోతే లోనికి ప్రవేశం లేదు.. ముందు కార్డు తీసుకొవాలి అని చెప్పింది.
మాకు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ యూనియన్ (టీఎంటీఏయు) ఐడెంటిటీ కార్డ్ ఉంది అంటే.. అది పని చేయదు. దీనికి ఫిలిం నగర్ ఫిల్మ్ ఛాంబర్ కార్డు కావాలి.. లేకపోతే లోనికి ప్రవేశం లేదు.. ముందు కార్డు తీసుకొవాలి అని చెప్పింది. ఆ కార్డు వద్దు అంటే నీవు ఆర్టిస్ట్ అని ఏంటీ గ్యారంటీ అని డౌట్ పెట్టేసింది.
అయితే సరే.. మీరు అడిగినట్టే డబ్బులిస్తాం. అంతకంటే ముందే మీ ఫోటో ఒకటి తీసుకుంటాం. ఇది మీ ఫీలిమ్ చాంబర్లో చూపించి పేమెంట్ అక్కడే పే చేసి ఐడీ కార్డ్ తీసుకుంటాం! అని టీఎంటీఏయు ఆర్టిస్టు ఆమెకు చెప్పాడు. ఒక ఫోటో కూడా తీసాడు. సరే.. వెయిట్ చేయండి.. ఇప్పుడే వస్తాను అంటూ జంప్..!
ఈ ఘటనను బట్టి ఔత్సాహిక ఆర్టిస్టులు యువతరం అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. రంగుల మాయా ప్రపంచంలో మోసగాళ్లకు కొదవేమీ లేదు. అవకాశాల పేరిట బురిడీ కొట్టించి డబ్బు గుంజుతారు. డబ్బులు లాగడం కోసం ఇలాంటి పనులు కాపు కాసి మరీ చేస్తుంటారు.
కానీ అది నిజమని నమ్మి ఎంతో మంది మోసపోతున్నారు. అలాంటి వారంతా.. వాస్తవాలను పరిశీలించాకే ముందుకు వెళ్లాలని అనుభవంతో చెబుతున్నారు టీఎంటీఏయు మెంబర్. కిలాడీ లేడీస్ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.