Begin typing your search above and press return to search.
భాగమతి.. అక్కడ అదరగొట్టేసిందే
By: Tupaki Desk | 28 Jan 2018 11:24 AM GMTరిపబ్లిక్ డే వీకెండ్లో భారీ అంచనాల మధ్య రిలీజైన ‘భాగమతి’ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది. ఈ చిత్రం తొలి రోజు రూ.7 కోట్ల దాకా షేర్.. రూ.10 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. రెండో రోజు కూడా వసూళ్లు నిలకడా ఉన్నాయి. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్లో రూ.15 కోట్ల దాకా వరల్డ్ వైడ్ షేర్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలకు మాత్రమే ఇలాంటి వసూళ్లు సాధ్యం. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఈ కలెక్షన్లు రావడం అనూహ్యమే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. అమెరికాలోనూ ‘భాగమతి’ అదరగొడుతుండటం విశేషం.
‘భాగమతి’ రెండే రోజుల్లో హాఫ్ మిలియన్ క్లబ్బులోకి అడుగు పెట్టేసింది అమెరికాలో. గురువారం ప్రిమియర్లతో కలిసి శుక్రవారానికి ఈ చిత్ర వసూళ్లు 2.75 లక్షల డాలర్లు వచ్చాయి. శనివారం అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టిందీ చిత్రం. ఏకంగా 2.5 లక్షల డాలర్లతో హాఫ్ మిలియన్ మార్కును దాటేసింది. ఆదివారానికి ఈ చిత్రం 7 లక్షల డాలర్ల మార్కును అందుకునే అవకాశముంది. వీక్ డేస్ లోనూ పర్వాలేదనిపిస్తే ఫుల్ రన్లో మిలియన్ మార్కును కూడా అందుకోవచ్చు. ‘భాగమతి’కి పాజిటివ్ రివ్యూలు రావడం.. అమెరికన్ తెలుగు ఆడియన్స్ థ్రిల్లర్లను ఇష్టపడటం దీనికి కలిసొస్తోంది. ఫుల్ రన్లో ‘భాగమతి’ వరల్డ్ వైడ్ రూ.25 కోట్ల షేర్ సాధించే అవకాశాలున్నాయి.