Begin typing your search above and press return to search.

అక్కడ మాత్రం ‘భాగమతి’ తుస్సే..

By:  Tupaki Desk   |   31 Jan 2018 9:19 AM GMT
అక్కడ మాత్రం ‘భాగమతి’ తుస్సే..
X
ఒక భాషలో సూపర్ హిట్టయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేస్తే ఆడకపోవచ్చు. అలాగే ఒకేసారి వేర్వేరు భాషల్లో రిలీజయ్యే సినిమా కూడా ఒక చోట బాగా ఆడి మరో చోట తేలిపోతుంటుంది. ఇప్పుడు ‘భాగమతి’ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ చిత్రం తెలుగులో ఆల్రెడీ హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఇప్పటికే దాదాపుగా బయ్యర్ల పెట్టుబడిని వెనక్కి తెచ్చేసింది. రూ.20 కోట్ల షేర్ మార్కుకు చేరువగా ఉంది. వీకెండ్ తర్వాత కూడా వసూళ్లు నిలకడగా ఉన్నాయి. ‘భాగమతి’ని తెలుగుతో పాటు ఒకేసారి తమిళ.. మలయాళ భాషల్లోనూ విడుదల చేశారు. కానీ అక్కడ తెలుగు వెర్షన్ కు వచ్చిన ఫలితం దక్కేలా లేదు.

తమిళంలో ‘భాగమతి’ థియేట్రికల్ హక్కులతో పాటు శాటిలైట్ రైట్స్ కూడా కలిపి రూ.10 కోట్లకు అమ్మారు. ఐతే తొలి వారాంతంలో ఈ చిత్రం రూ.3 కోట్ల షేర్ మాత్రమే రాబట్టిందట. థియేట్రికల్ హక్కుల వాల్యూ రూ.7.5-8 కోట్ల మధ్య ఉండొచ్చంటున్నారు. ఫుల్ రన్లో అందులో సగం మాత్రమే వసూలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు మలయాళంలో కూడా ‘భాగమతి’ పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. ఉన్ని ముకుందన్.. జయరాం లాంటి మలయాళ నటులు ఇందులో కీలక పాత్రలు చేసినా రెస్పాన్స్ అంతంతమాత్రంగానే ఉందంటున్నారు. తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం వేరే భాషల్లో మాత్రం మెప్పించలేకపోవడం ఆశ్చర్యమే. బహుశా యువి క్రియేషన్స్ వాళ్ల బ్రాండ్ వాల్యూ.. పబ్లిసిటీ ఇక్కడ బాగా కలిసొచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.