Begin typing your search above and press return to search.
సల్మాన్ అంతలా రిక్వెస్టు చేస్తేనే హగ్ కు ఓకే చెప్పా?
By: Tupaki Desk | 5 Sep 2021 4:30 AM GMTభారత్ లాంటి దేశంలో ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ కావటం.. అదిరిపోయే ఆఫర్లు వచ్చినా నో చెప్పటం.. లాంటివి ఏ హీరోయిన్ కు సాధ్యం కాదేమో. అలాంటి అరుదైన రికార్డు భాగ్యశ్రీ సొంతం. ఇప్పటి తరానికి ఆమె పెద్దగా తెలీకపోవచ్చు. కానీ.. డెబ్భై.. ఎనభైల్లో పుట్టిన వారందరికి భాగ్యశ్రీ క్రేజ్ ఏమిటో? ఒక్క సినిమాతో ఆమె రేపిన సంచలనం ఎంతో.. యూత్ ఆమెకు ఎంతలా ఫిదా అయ్యారో గతంలోకి వెళితే అర్థమవుతుంది.
1989లో విడుదలైన మైనే ప్యార్ కియా.. తెలుగులో ప్రేమ పావురాలు.. ఈ మూవీ సాధించిన సంచలన విజయం అంతా ఇంతా కాదు. అప్పట్లో వసూళ్ల వర్షం కురిపించటమే కాదు.. ఒక హిందీ డబ్బింగ్ సినిమాకు ఉమ్మడి రాష్ట్రంలోని థియేటర్లు కిక్కిరిసిపోవటమే కాదు.. ఆ సినిమా టికెట్ల కోసం పడిన పాట్లు అన్ని ఇన్ని కావు. అలాంటి మూవీలో హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ.. ఆ తర్వాత మూవీస్ ఒప్పుకోలేదు. అప్పటికే ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్న ఆమె.. తర్వాత సినిమాలు చేయటానికి ఒప్పుకోలేదు.
తర్వాతి కాలంలో తన భర్తను హీరోగా పెట్టి సినిమాలు తీస్తానంటేనే ఓకే చెబుతానని చెప్పటం అందుకు సైతం నిర్మాతలు ఓకే అనటం చూస్తే.. ఆమెకున్న డిమాండ్ ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. సాదాసీదాగా ఉండే అమ్మాయి అయినా.. ఆమెను తమ ఇంటి పక్కన అమ్మాయిగా అప్పటి తరం ఫీల్ కావటం.. కోట్లాది మంది యూత్ కు కలల రాణిగా మారారు భాగ్యశ్రీ. కట్ చేస్తే.. తాజాగా ఆమె ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ లో కీలకపాత్రలో కనిపిస్తున్నారు. ఈ వారాంతంలో విడుదలయ్యే జయలలిత బయోపిక్ 'తలైవి'లోనూ కీ రోల్ ప్లే చేశారు.
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన తొలి సినిమా షూటింగ్ సంగతుల్ని.. అప్పటి పరిస్థితుల్ని.. ఆ సినిమా షూట్ వేళ జరిగిన విశేషాల్ని ఆమె పంచుకున్నారు. మైనే ప్యార్ కియా మూవీ షూటింగ్ వేళకు తనకు పద్దెనిమిదేళ్లు మాత్రమేనని.. అప్పటికే తాను ఒకరితో ప్రేమలో ఉండటం.. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకొని ఉన్నట్లు చెప్పారు. 'అందుకే సినిమాలో కొన్ని సీన్లకు నో చెప్పాను. త్వరలో ప్రేమించిన వాడిని పెళ్లాడబోయే నేను.. మరో వ్యక్తిని కౌగిలించుకోవటం సాధ్యం కాదని నో చెప్పాను. అప్పుడు సల్మాన్ ఖాన్ నా వద్దకు వచ్చి.. ప్లీజ్.. సినిమా కోసం ఈ సీన్ చేయండంటూ చాలా రిక్వెస్టు చేశారు. అతని మాటకు గౌరవం ఇచ్చి ఓకే చెప్పా మరో సీన్ లో సల్మాన్ ను ముద్దు పెట్టకోవాలి. అలా చేయటం నాకెంతో ఇబ్బంది. ఆ విషయాన్ని గుర్తించిన దర్శకుడు.. సల్మాన్.. నాకు మధ్య అద్దాన్ని అడ్డుగా పెట్టారు. మేమిద్దరం అద్దాన్ని ముద్దు పెట్టుకుంటే చాలనటంతో హమ్మయ్య అనుకొన్నా . అలా కిస్ సీన్ షూట్ చేశారు' అంటూ గతం గురించి గుర్తు చేసుకున్నారు.