Begin typing your search above and press return to search.

వర్మ మరో సంచలనంకు సిద్దం

By:  Tupaki Desk   |   31 Aug 2018 3:38 PM IST
వర్మ మరో సంచలనంకు సిద్దం
X
రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడూ ఏదో ఒక అంశంతో మీడియా ఉంటూనే ఉండేవాడు. కాని ఈమద్య కాలంలో వివాదాలతో కాని, సినిమాలతో కాని మీడియా ముందుకు రావడం లేదు. నాగార్జునతో వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఆఫీసర్‌’ చిత్రం ఫలితం తారుమారు అవ్వడంతో కాస్త షాక్‌ లోకి వెళ్లినట్లున్నాడు. చాలా తక్కువగా సోషల్‌ మీడియాలో కనిపిస్తున్న వర్మ సైలెంట్‌ గా ‘భైరవగీత’ అనే చిత్రాన్ని నిర్మించాడు. ధనన్జయక మరియు ఇర్రా హీరో హీరోయిన్‌ లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రం షూటింగ్‌ దాదాపుగా ముగిసినట్లుగా తెలుస్తోంది.

ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ ఆకట్టుకుంటుంది. హీరో - హీరోయిన్‌ లోతైన ప్రేమలో ఉన్నట్లుగా చూపిస్తున్న పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రం పంపిణీ హక్కులను అభిషేక్‌ పిక్చర్స్‌ దక్కించుకోవడంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంతో సిద్దార్థ తాతులు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కథను నమ్మి వర్మ ఈ చిత్రాన్ని నిర్మించినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈమద్య కాలంలో మంచి కాన్సెప్ట్‌ తో వచ్చిన చిన్న చిత్రాలకు మంచి ఆధరణ దక్కుతుంది. వర్మ శిష్యుడి నుండి వచ్చిన ‘ఆర్‌ ఎక్స్‌ 100’ చిత్రం ఎంతటి విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ సినిమా కూడా ఆకట్టుకుంటుందేమో అంటూ సినీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపు ట్రైలర్‌ విడుదల కాబోతున్న ఈ చిత్రంను వర్మ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడో చూడాలి.