Begin typing your search above and press return to search.

సాయి ప‌ల్ల‌వి పై భ‌జ‌రంగ్ ద‌ళ్‌ సీరియ‌స్‌

By:  Tupaki Desk   |   16 Jun 2022 3:34 PM GMT
సాయి ప‌ల్ల‌వి పై భ‌జ‌రంగ్ ద‌ళ్‌ సీరియ‌స్‌
X
రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన లేటెస్ట్ మూవీ `విరాట‌ప‌ర్వం`. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు జూన్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా  ప్రేక్ష‌కుల ముంద‌కొస్తోంది. ఏడాది కాలంగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ ఫైన‌ల్ గా మ‌రి కొన్ని గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ ప‌సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. 90వ ద‌శ‌కంలో ఉత్త‌ర తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కించారు. ఓ యువ‌తి ఎదుర్కోన్న విస్క‌ర సంఘ‌ట‌న‌లు.. ఆ త‌రువాత త‌న‌ని కోవ‌ర్డ్ గా భావించిన న‌క్సల్స్ ఆమెని హ‌త్య చేయ‌డం వంటి విష‌యాలు అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించాయి. దీనికి స‌మ‌కాలీన రాజ‌కీయ‌ల‌కు వున్న సంబంధాన్ని బ‌హిర్గ‌తం చేస్తూ ఈ మూవీని తెర‌కెక్కించామ‌ని ద‌ర్శ‌కుడు చెబుతూ వ‌స్తున్నారు.

న‌క్స‌ల్ నేప‌థ్యానికి ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ‌ని జోడించి ఈ మూవీని రూపొందించారు. అయితే ఈ మూవీ ఇప్ప‌డు టైటిల్ కార‌ణంగా వివాదంలో ఇరుక్కుంది. గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీ ప్ర‌చారం లో చురుగ్గా పాల్గొంటూ వివిధ మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ వ‌స్తోంది హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి. ఈ  నేప‌థ్యంలోనే తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌శ్మీర్ పండిట్ల హ‌త్య‌ల‌పై.. గోవుల‌ని తీసుకెళుతున్న బండి డ్రైవ‌ర్ ని కొంత మంది కొట్టి జై శ్రీ‌రామ్ అంటూ అన్నార‌ని, క‌శ్మీర్ పండిట్ల హ‌త్య‌ల‌కు, గో హ‌త్య‌ల‌కు ఎలాంటి తేడా లేద‌ని సాయి ప‌ల్ల‌వి చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి.

ఈ ఇందుకు సంబంధించిన వీడియోని వైర‌ల్ గా మారిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్‌ పై విశ్వ‌హిందూ ప‌రిష‌త్ భ‌జ‌రంగ్ ద‌ళ్ విభాగం సీరియ‌స్ అయింది. అంతే కాకుండా సినిమా క‌థ టైటిల్ కు ఏమాత్రం సంబంధం లేకుండా సినిమా నిర్మాణం జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంద‌ని, దీనికి న‌క్స‌లిజం క‌థ‌ని జోడించి మ‌హాభార‌త క‌థ‌లోని విరాట‌ప‌ర్వాన్ని అవమానించార‌ని తెలిసింద‌ని, అభ్యంత‌ర‌క‌ర అంశాలు వుంటే వెంట‌నే సినిమా విడుద‌ల‌ని నిలిపివేయాల‌ని సెన్సార్ బోర్డ్ కు భ‌జ‌రంగ‌ద‌ళ్ తెలంగాణ క‌న్వీన‌ర్ యు.

రాములు లేఖ రాశారు. అంతే కాకుండా సాయి ప‌ల్ల‌వి క‌శ్మీర్ పండిట్ ల హ‌త్య‌ల‌పై, గో హ‌త్య‌ల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ని సీరియ‌స్ తీసుకున్న భ‌జ‌రంగ్ ద‌ళ్ వారు కోఠి సుల్తాన్ బ‌జార్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. మ‌రి కొన్ని గంట‌ల్లో థియేట‌ర్లలోకి `విరాట‌ప‌ర్వం` రానున్న నేప‌థ్యంలో వివాదాలు చుట్టుముడుతుండ‌టం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.