Begin typing your search above and press return to search.
నాని కలైనా కని ఉంటాడా?
By: Tupaki Desk | 8 Sep 2015 8:01 AM GMTనాని కెరీర్ లో చాలా హిట్లున్నాయి. కానీ అతడి రేంజి ఎప్పుడూ ఆరేడు కోట్లకు మించింది లేదు. కెరీర్ లో అతి పెద్ద హిట్టు అనదగ్గ ‘పిల్ల జమీందార్’ కూడా ఈ స్థాయిలోనే వసూళ్లు రాబట్టింది. ఐతే ఇప్పుడు ‘భలే భలే మగాడివోయ్’ కేవలం అమెరికాలో మాత్రమే ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టేలా ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోలు కూడా కలలు కన్న మిలియన్ క్లబ్బును ఇప్పుడు నాని అలవోకగా అందుకుంటున్నాడు. అమెరికాలో ఆ సినిమా ప్రభంజనం చూస్తుంటే స్టార్ హీరోలకు కూడా దిమ్మదిరిగిపోయేలా ఉంది. యుఎస్ బాక్సాఫీస్ లో నాని సినిమా హవా మామూలుగా లేదు. ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా టాలీవుడ్ టాప్-15 జాబితాలో చోటు సంపాదించింది. తొలి వీకెండ్ లో ‘భలే భలే మగాడివోయ్’ 0.72 మిలియన్ డాలర్లు వసూలు చేసి 15వ స్థానంలో నిలిచింది.
బాహుబలి ఈ లిస్టులో 4.31 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత వరుసగా శ్రీమంతుడు (2.09 మి), అత్తారింటికి దారేది (1.518 మి), ఆగడు (1.403 మి), సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు (1.22 మి), బాద్ షా (1.032 మి), సన్నాఫ్ సత్యమూర్తి (1.010 మి), దూకుడు (0973 మి), 1 నేనొక్కడినే (0.948 మి), టెంపర్ (0.872 మి), మనం (0.862 మి), రేసుగుర్రం (0.842 మి), గబ్బర్ సింగ్ (0.78 మి), గోపాల గోపాల (0.725 మి), భలే భలే మగాడివోయ్ (0.720 మి) ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ ‘గోపాల గోపాల’ ఎంత వసూలు చేసిందో దాదాపుగా నాని సినిమా కూడా అంత కలెక్ట్ చేయడమంటే మామూలు విషయం కాదు. యుఎస్ లో ఈ సినిమాను 110 స్క్రీన్ లలో విడుదల చేయడం కలిసొచ్చింది. ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ మొదలవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో లాగే.. యుఎస్ లోనూ హౌస్ ఫుల్స్ తో నడుస్తోందీ సినిమా. మొత్తానికి నాని కెరీర్ లో ‘భలే భలే మగాడివోయ్’ ఓ మైలురాయిలా నిలిచిపోబోతోంది.