Begin typing your search above and press return to search.
భలే భలే.. ఓవర్సీస్ పెరిగింది
By: Tupaki Desk | 9 Sep 2015 4:24 AM GMTఓవర్సీస్ మార్కెట్ లో స్టార్ హీరోలకు మాత్రమే గిరాకీ. మహేష్ - పవన్ - ఎన్టీఆర్ - ప్రభాస్ ఇలాంటి స్టార్ లకు మాత్రమే మార్కెట్ ఉంది. అమెరికా లాంటి చోట ఛోటామోటా హీరోల సినిమాలు ఇంతకాలంగా రిలీజైందే లేదు. అయితే నాని హీరోగా నటించిన భలే భలే మగాడివోయ్ ఓవర్సీస్ లో రికార్డ్ హిట్ కొట్టి టోటల్ ట్రాక్ రికార్డునే మార్చేసింది. ఈ సినిమా పరిమిత బడ్జెట్ లో తెరకెక్కి అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన తొలి సినిమాగా రికార్డుల కెక్కింది. దీంతో ఆ ప్రభావం రిలీజ్ కి రెడీ అవుతున్న ఇతర చిన్న బడ్జెట్ సినిమాలపై పడింది.
దర్శకుల్లో అంతో ఇంతో క్రేజు ఉన్నవారైతే చాలు అసలు ఏ మార్కెట్ లేని హీరోలకైనా ధర బాగానే పలుకుతోంది. ఇప్పటికిప్పుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కంచె' సినిమాకి అమెరికా మార్కెట్ నుంచి భారీగానే డిమాండ్ ఏర్పడింది. అలాగే సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చి త్రానికి డిమాండ్ బావుందని చెబుతున్నారు. టాలీవుడ్ లో ఇది కొత్త పరిణామం. భలే భలే మగాడివోయ్ హిట్ కొట్టడంతో వచ్చిన పరిణామం. ఇది తెలుగు సినిమాకి మేలు చేసేదే. ఇతరత్రా చిన్నా చితకా సినిమాలకు కూడా ఇప్పుడు విదేశీ మార్కెట్ లో గిరాకీ పెరగడం అంటే ఆ మేరకు నిర్మాతకు మేలు జరుగుతున్నట్టే. హ్యాట్సాఫ్ టు నాని అండ్ మారుతి.