Begin typing your search above and press return to search.
వామ్మో.. నాని సినిమాకు ఇంత క్రేజా?
By: Tupaki Desk | 1 Sep 2015 1:55 PM GMTనాని ఏమీ స్టార్ హీరో కాదు. పైగా ఈ మధ్య అతడి కెరీర్ ఏమంత గొప్పగా లేదు. అయినప్పటికీ ‘భలే భలే మగాడివోయ్’ పెద్ద హీరో సినిమా తరహాలో క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాను విడుదల చేస్తున్న తీరు.. బయ్యర్ల ఉత్సాహం చూస్తుంటే.. చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 800కు పైగా థియేటర్లలో విడుదలవుతుండటం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయడం పెద్ద విషయం కాదు కానీ.. ఓవర్సీస్ లో కూడా ఇప్పటిదాకా ఏ చిన్న సినిమాను విడుదల చేయని స్థాయిలో ‘భలే భలే మగాడివోయ్’ని రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో ఏకంగా 110 స్క్రీన్స్ ఇచ్చారు ఈ సినిమాకు. ముఖ్యంగా అమెరికాలో స్టార్ హీరోల సినిమాలకు దీటుగా రిలీజవుతోంది ‘భలే భలే మగాడివోయ్’.
దర్శకుడు, నిర్మాతలు కొన్ని ఏరియాల్ని పంచుకుని.. సొంతంగా సినిమాను విడుదల చేస్తుండటాన్ని బట్టి ‘భలే భలే మగాడివోయ్’ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాంధ్ర, గుంటూరు ఏరియాల్లో యువి క్రియేషన్స్ పంపిణీ చేస్తుంటే.. అల్లు అరవింద్ నైజాం, ఈస్ట్, వెస్ట్ తీసుకున్నాడు. డైరెక్టర్ మారుతి గుంటూరు ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు. మిగతా ఏరియాల డిస్ట్రిబ్యూషన్, శాటిలైట్ రైట్స్ అమ్మకంతో పెట్టుబడి వచ్చేసిందని.. దర్శకుడు, నిర్మాతలు కలిసి పంపిణీ చేయడం ద్వారా వస్తున్న ఆదాయమంతా లాభాల రూపంలో నేరుగా వారి ఖాతాలోకే వెళ్తోందని సమాచారం. ఓ చిన్న సినిమాతో విడుదలకు ముందే ఈ స్థాయిలో లాభాల్లోకి రావడమంటే చిన్న విషయమేమీ కాదు. ఎంతైనా అల్లు అరవింద్, మారుతిలవి మంచి బిజినెస్ బుర్రలు కదా.