Begin typing your search above and press return to search.
నాలుగో వారంలోనూ దున్నేస్తున్న నాని
By: Tupaki Desk | 27 Sep 2015 11:30 AM GMTఈ రోజుల్లో ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా, సినిమాకు మంచి టాక్ వచ్చినా రెండో వీకెండ్ అవ్వగానే డల్ అయిపోతుంటుంది. కానీ నాని సినిమా ‘భలే భలే మగాడివోయ్’ మాత్రం నాలుగో వీకెండ్ లోనూ దుమ్ముదులిపేస్తోంది. నమ్మశక్యం కాని రీతిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది. సెప్టెంబరు 4న విడుదలైన ఈ సినిమా నాలుగో వీకెండ్ లోనూ హౌస్ ఫుల్స్ తో నడుస్తుండటం విశేషం. నిన్న శనివారం - ఈ రోజు ఆదివారం పెద్ద నగరాల్లో దాదాపుగా అన్ని షోలూ హౌస్ ఫుల్సే. హైదరాబాద్ లో బుకింగ్స్ చూస్తే దాదాపు ప్రతి షో కూడా నిండుగా కనిపిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చెన్నై - బెంగళూరు నగరాల్లో కూడా నాని సినిమా దుమ్ముదులుపుతోంది. ఈ రోజు ప్రతి షో ఫుల్ గానే కనిపిస్తోంది.
‘భలే భలే మగాడివోయ్’కి మూడు వారాల పాటు సరైన పోటీనే లేకపోయింది. దాంతో పాటుగా విడుదలైన ‘డైనమైట్’ అడ్రస్ లేకుండా పోయింది. ఆ తర్వాతి వారాల్లో వచ్చిన హోరాహోరీ - కొరియర్ బాయ్ కళ్యాణ్ కూడా దారుణమైన ఫలితం చూశాయి. దీంతో రెండు, మూడు వీకెండ్ లలో కూడా నాని సినిమానే హవా సాగించింది. ఈ వారం విడుదలైన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. దానికి దీటుగా నాని సినిమా దూసుకెళ్తోంది. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’కు ఎంత టాక్ వచ్చినప్పటికీ అందులో ‘మెగా’ భజన ఎక్కువైపోవడంతో కొన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అవకాశం లేదు. నాని సినిమాకు అలాంటి ఇబ్బందేమీ లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులకూ ఆమోద యోగ్యమైన సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ - న్యూట్రల్ గా ఉండే ప్రేక్షకులు దీన్నే ప్రిఫర్ చేస్తున్నారు. అందుకే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’కు దీటుగా దూసుకెళ్తోంది.