Begin typing your search above and press return to search.
అలా సినిమా పేరు మర్చిపోతే ఎలా నానీ...
By: Tupaki Desk | 12 Aug 2015 5:17 PM GMTతెలుగు సినిమా కధలు ఒకే మూసలో పోకూడదని తపించే యువకధనాయకులలో నాని ఒకడు. హిట్, ఫ్లాపుల భేషజాలు లేకుండా సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని ప్రదర్శించడం నానికి అలవాటు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'భలే భలే మగాడివోయ్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసినదే.
ఈ సినిమా ఆడియో ఈ నెల 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా విడుదలచేసిన టీజర్ కూడా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ టీజర్ కంటే వినూత్నంగా మరో రికార్డింగ్ టైప్ లో చేసిన ప్రచారం ప్రస్తుతం హాట్ టాపిక్. మెమరీ నిల అని ఎలానో ట్యాగ్ లైన్ లో తగిలించారుగాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఈ వీడియో తీశారు.
సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూ వివరాలు తెలుపుతూ నాని మొత్తానికి సినిమా పేరు మర్చిపోతాడు. బాహుబలి అంటూ, భాజరంగీ భాయ్ జాన్ అంటూ నానా హంగామా చేసాడు. ఈ వీడియోకి టీజర్ ని రిలేట్ చేసుకుంటే సినిమాలో నానికి పేర్లను మరిచిపోయే గుణం వున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని యు.వి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.