Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: రాజు భాయి.. అరవింద్ భాయి!
By: Tupaki Desk | 27 Sep 2018 11:27 AM GMTటాలీవుడ్ లో చిన్న సినిమాల జోరు కొనసాగుతూనే ఉంది. ఇక ఈమధ్య ట్రెండ్ కు భిన్నంగా ఫన్ టోన్ లో సాగే కామెడీ ఎంటర్టైనర్ 'భలే మంచి చౌక బేరమ్'. నవీద్..పార్వతీశం.. యామిని భాస్కర్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల అయింది. రెండు నిముషాల కంటే తక్కువ నిడివి ఉన్న ఈ ట్రైలర్ స్టార్ట్ లోనే రాజా రవీంద్ర "ఈ దేశ రహస్యాలను నా ముప్పై ఏళ్ళ ఆర్మీ ఎక్స్ పీరియెన్స్ తో రాస్తున్నాను.. వాళ్ళిద్దరూ దొరికిన రోజున నేనేంటో నీకు తెలుసుతుంది" అంటాడు. ఇక 'దేశరహస్యాలు' అనే టైటిల్ ఉనే ఒక రహస్య సమాచారం ఉండే ఫైల్ ను చూపిస్తారు. ఇక ఇద్దరు అల్లరి చిల్లరగా ఉండే యువకులుగా నవీద్.. పార్వతీశం లను చూపించారు.
ఆ ఫైల్ ను చూపిస్తూ.. పార్వతీశం 'దీన్ని మనం అమ్మితే అప్పులు మొత్తం తీరిపోతాయి' అని సలహా ఇస్తాడు... ఇక సినిమా థీమ్ అర్థం అయింది కదా. ఇక అవి అమ్మే ప్రాసెస్.. తర్వాత జరిగే సంఘటనలు ఒకటి అరా శాంపిల్ చూపించారు. ఇక పార్వతీశం కామెడీ టైమింగ్ పంచ్ లతో ట్రైలర్ లో ఫన్ పార్ట్ బాగానే వర్క్ అవుట్ అయింది. ఓల్డ్ సిటీకి వెళ్లి నవీద్ "దేశారహస్యాలు పాకిస్తాన్ కి అమ్మిపెడతారేమో" అని నసుగుతూ ఉంటే అవతలి వ్యక్తీ 'ఫిర్ సే బోల్' అంటూ పెద్దగా అరుస్తాడు.. ఇక నూకరాజు కూల్ గా "మాదగ్గర రెండు చిరిగిపోయిన కట్ డ్రాయర్లున్నాయి. సెకండ్ హ్యాండ్ కి అమ్మి పెడతారా?" అంటూ పంచ్ వేస్తాడు. "రాజు భాయ్ .. సురేష్ భాయ్.. ఆరవింద్ భాయ్... ఏ భాయి నన్ను పట్టించుకోలేదు" అని రాజా రవీంద్ర చెప్పే డైలాగ్ కూడా ఫన్నీ గా ఉంది. ఆ భాయిలు ఎవరు అనుకుంటారేమో.. ట్రైలర్ చూస్తే మీకే తెలుస్తుంది.
ఓవరాల్ గా చూస్తే ఇదేమీ కొత్త కాన్సెప్ట్ కాకపోయినా ఫన్ జెనరేట్ అయ్యే స్టఫ్ మాత్రం ఉంది. ఈ సినిమా కు దర్శకుడు మారుతి కాన్సెప్ట్ అందించడం విశేషం. హరి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఎం. మురళి కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. ఆరోళ్ళ సతీష్ కుమార్ ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతలోపు మీరు ఆ దేశరహస్యాలు ఏంటో చూడండి.