Begin typing your search above and press return to search.
సుధీర్ బాబుకి ‘భలే’ ఆఫర్ ఇచ్చారే..
By: Tupaki Desk | 7 March 2016 9:30 AM GMTమహేష్ బావ అనే గుర్తింపుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. హీరోగా నిలదొక్కుకోవడానికి మొదట్నుంచి బాగానే కష్టపడుతూ వస్తున్నాడు సుధీర్ బాబు. ఐతే మొన్నటిదాకా హీరోగా చెప్పుకోవడానికి తనకంటూ ఓ హిట్టు లేదనే బాధ ఉండేది. ‘ప్రేమకథా చిత్రమ్’ హిట్టే కానీ.. ఆ క్రెడిట్ ఏమీ అతడికి దక్కలేదు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ మంచి పేరు తెచ్చింది కానీ.. కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సుధీర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘భలే మంచి రోజు’ అంచనాల్ని అందుకుంది. గత ఏడాది చివర్లో క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా సుధీర్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టి కమర్షియల్ సక్సెస్ అయింది.
‘భలే మంచి రోజు’ శాటిలైట్ రైట్స్ కూడా మంచి ధరే పలికాయి. మాటీవీ ఈ చిత్రాన్ని రూ.1.7 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. ‘ప్రేమకథా చిత్రమ్’ కంటే కూడా ఇది ఎక్కువ ధరే. సుధీర్ బాబు కెరీర్ లో ఇదే రికార్డు. తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి.. థియేట్రికల్ రన్ తోనే లాభాలందుకున్న కొత్త నిర్మాతలు విజయ్, శశిలకు ఇది బోనస్ లాభమే. కొత్త దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందించిన ఈ చిత్రంలో సుధీర్ సరసన వామికా గబ్బి హీరోయిన్ గా నటించింది. సాయికుమార్ - కృష్ణచైతన్య - వేణు - పృథ్వీ ముఖ్య పాత్రలు పోషించారు. టీవీ ఆడయిన్స్ టేస్టుకు సూటయ్యే సినిమా కావడంతో అక్కడ కూడా ‘భలే మంచి రోజు’ మంచి సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి.