Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ 2 బ్యూటీలకు బంపర్ ఆఫర్స్
By: Tupaki Desk | 24 Sep 2018 12:25 PM GMTబిగ్ బాస్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆధరణ ఉన్న విషయం తెల్సిందే. ఇండియాలో పుష్కర కాలంగా హిందీ వర్షన్ బిగ్ బాస్ ప్రసారం అవుతున్న విషయం తెల్సిందే. హిందీలో సంచలన హిట్ అయిన బిగ్ బాస్ తో ఎంతో మంది సెలబ్రెటీలు స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నారు. పెద్దగా గుర్తింపు లేని వారు బిగ్ బాస్ లోకి వెళ్లి స్టార్స్ అయ్యారు. హిందీలో ఈ లెక్క చాలానే ఉంది. ఇక గత సంవత్సరం తెలుగులో ప్రారంభం అయిన బిగ్ బాస్ కూడా పలువురు కొత్త స్టార్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. మొదటి సీజన్ తో పలువురు గుర్తింపును దక్కించుకుని సెటిల్ అవ్వగా, ప్రస్తుతం రెండవ సీజన్ కూడా పలువురికి స్టార్ స్టేటస్‌ను తెచ్చి పెట్టింది.
బిగ్ బాస్ లో కేవలం రెండు మూడు వారాలు ఉన్నా కూడా విపరీతమైన క్రేజ్ ను దక్కించుకోవచ్చు అని గతంలో పలువురు స్టార్లు నిరూపించారు. తాజాగా భానుశ్రీ విషయంలో కూడా అదే జరిగింది. కొన్ని వారాల్లోనే ఆమె ఎలిమినేట్ అయినా కూడా యాపిల్ టాస్క్ సమయంలో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చేసిన రచ్చ మామూలు రచ్చ కాదు. ఆ ఎపిసోడ్ తో ఆమెకు భారీగా గుర్తింపు దక్కింది. ఆ ఎపిసోడ్ కారణంగానే ఆమె ఎలిమినేట్ అయ్యిందనే టాక్ కుడా ఉంది. ఎలిమినేట్ అయిన తర్వాత భాను శ్రీకి మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈమె ఈటీవీలో ప్రసారం అయ్యే డాన్స్ ఢీ షోకు హోస్ట్ గా ఎంపిక అయ్యింది.
ఢీ కొత్త సీజన్ లో ప్రదీప్ మరియు సుధీర్ లతో కలిసి భాను శ్రీ హోస్టింగ్ గా కనిపించబోతుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రోమోలు బుల్లి తెరపై సందడి చేస్తున్నారు. బుల్లి తెరపై భానుశ్రీ రచ్చ చేయడం ఖాయం అంటూ మొదటి ఎపిసోడ్‌తో తేలిపోయింది. ఇక మరో బిగ్ బాస్ 2 పార్టిసిపెంట్ తేజస్వి కూడా బుల్లి తెర రియాల్టీ షోకు హోస్ట్ గా వ్యవహరించే ఛాన్స్ దక్కించుకుంది. ఈమె పెద్ద గొంతు మరియు ఆమె వ్యక్తిత్వంతో అందరి దృష్టిని ఆకర్షించింది. స్టార్ మాలో ప్రసారం అవ్వబోతున్న ‘లాఫ్టర్ ఛాలెంజ్’ కు హోస్ట్‌గా వ్యవహరించబోతుంది. బ్రహ్మానందం ఆధ్వర్యంలో ఈ షో జరుగబోతున్నట్లుగా ఇప్పటికే విడుదలైన ప్రోమోల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 2 తో ఈ ఇద్దరు బ్యూటీలు బుల్లి తెరపై హోస్ట్ లుగా బిజీ కాబోతున్నారు. వీరితో పాటు ఇంకా పలువురు కూడా బిగ్ బాస్ 2 తో స్టార్ డంను దక్కించుకున్నారు.