Begin typing your search above and press return to search.
పాపం.. బన్నీ హీరోయిన్ పరిస్థితి ఇలా అయిందేంటి..!
By: Tupaki Desk | 3 April 2021 1:30 PMభానుశ్రీ మెహ్రా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ కాంబినేషన్ లో 2010లో వచ్చిన 'వరుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో హీరోయిన్ ని చూపించకుండా.. వధువు ఎవరంటూ చాలా హైప్ ని క్రియేట్ చేయడంతో అప్పట్లో ఆమె టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అవడంతో భానుశ్రీకి చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. అందులోనూ 'వరుడు'లో హీరో ఆమెను పెళ్లి చేసుకునే వరకు కూడా ఎక్కడా ఆమె ఫేస్ ను చూపించరు. సినిమా విడుదల ముందు కూడా ఆమె ఫొటోలు బయటపెట్టకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ రావడం.. సినిమాలోనూ సగం వరకు ఆమెను చూపించకపోవడంతో భానుశ్రీ ఎవరికీ పెద్దగా గుర్తు లేకుండా పోయింది.
'వరుడు' సినిమా తర్వాత 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ' 'అలా ఎలా' 'గోవిందుడు అందరివాడేలే' 'మిస్ ఇండియా' వంటి సినిమాలో సపోర్టింగ్ రోల్స్ చేసినా ఆమె సినీ కెరీర్ కు ఉపయోగపడలేదు. కన్నడం, పంజాబీ, తమిళ చిత్రాల్లో నటించినా అక్కడ కూడా భానుశ్రీకి నిరాశే ఎదురైంది. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించిన భాను.. రామ్ చరణ్ కి తల్లిగా కనిపించాల్సి వచ్చిందంటేనే ఆమె కెరీర్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ భామ పరిస్థితి అలానే ఉంది. యూట్యూబ్ ఛానల్ పెట్టి భాను పోస్ట్ చేసే వీడియోలకు కూడా స్పందన కరువైంది. అందుకే ఏ సెలబ్రిటీ ట్వీట్ పెట్టినా దాని కింద నా వీడియో చూడండి అంటూ కామెంట్స్ ప్రమోట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది.
ఇటీవల బన్నీ ఆల్ మోస్ట్ 18 ఏళ్ళు అయింది నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయి అని ట్వీట్ చేయగా.. దీనికి 'వరుడు' సినిమా విడుదలై ఆల్ మోస్ట్ 11 ఏళ్ళు అయిందని భాను కామెంట్ పెట్టింది. తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్ పేజెస్ పెట్టే పోస్టులకు కూడా భాను కామెంట్స్ పెడుతుండటం గమనార్హం. ఏ హీరోయినైనా సక్సెస్ లో లేకపోతే ఎవరూ పట్టించుకోరు అనడానికి భానుశ్రీ నే ఉదాహరణగా చెప్పొచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ 'వరుడు' సినిమా హిట్ అయ్యుంటే భానుశ్రీ మెహ్రా కెరీర్ ఎలా ఉండేదో మరి..!