Begin typing your search above and press return to search.

3 మిలియ‌న్ల క్ల‌బ్ లో `భ‌ర‌త్ అనే నేను`

By:  Tupaki Desk   |   29 April 2018 1:04 PM IST
3 మిలియ‌న్ల క్ల‌బ్ లో `భ‌ర‌త్ అనే నేను`
X
టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు, విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివల కాంబోలో తెర‌కెక్కిన `భ‌ర‌త్ అనే నేను`సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాస‌ర్ గా నిలిచిన ఈ చిత్రం...లోక‌ల్ తో పాటు ఓవ‌ర్సీస్ లో కూడా రికార్డు క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతోంది. తాజాగా అమెరికాలో ఈ చిత్రం స‌రికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా ఈ సినిమా 3 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. ఆ ఘ‌న‌త సాధించిన మహేష్ బాబు తొలి సినిమా ఇదే కావ‌డం విశేషం. ఇటీవ‌ల విడుద‌లై 3.5 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసిన `రంగ‌స్థలం`సినిమాను `భ‌ర‌త్ అనే నేను`బీట్ చేస్తుంద‌ని ఆ చిత్ర నిర్మాత డీవీవీ దాన‌య్య కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

కొర‌టాల‌ - మ‌హేష్ కాంబోలో తెర‌కెక్కిన 'శ్రీమంతుడు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. అప్పట్లో శ్రీమంతుడు యూఎస్ లో 2.8 మిలియన్ డాలర్లను వ‌సూలు చేసింది. అదే త‌ర‌హాలో సామాజిక క‌థాంశంతో రూపొందిన `భ‌ర‌త్ అనే నేను` కూడా రికార్డు క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేస్తోంది. . మ‌హేష్ నటించిన చిత్రాలలో కెల్లా అత్య‌ధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా భ‌ర‌త్ మ‌రో రికార్డు క్రియేట్ చేసింది. అమెరికాలో ఈ సినిమా కలెక్షన్లు 3 మిలియన్ మార్క్ ను దాటినట్టు నిర్మాత డీవీవీ దానయ్య తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ సినిమా తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 161.28 కోట్లు రాబట్టింది. మ‌రోవారంలో రంగ‌స్థ‌లం రికార్డును ఈ సినిమా అధిగ‌మిస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు కూడా అంచ‌నా వేస్తున్నాయి. ఎవెంజ‌ర్స్ వార్ వంటి భారీ చిత్రంతో పోటీ ప‌డి మ‌రీ మ‌హేష్ ఈ ఘ‌న‌త సాధించాడు. అమెరికాలో 3 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసిన చిత్రాల్లో బాహుబ‌లి-2 - బాహుబ‌లి-1 - రంగ‌స్థలం త‌ర్వాత భ‌ర‌త్ అనే నేను ఉండ‌డం విశేషం.