Begin typing your search above and press return to search.

మహేష్ 'నెంబర్ వన్' భరత్

By:  Tupaki Desk   |   16 March 2018 11:58 AM IST
మహేష్ నెంబర్ వన్ భరత్
X
చూస్తుండగానే ఈ పదేళ్లలో మన స్టార్ హీరోల క్రేజ్ చాలా పెరిగిపోయింది. వారు చేస్తోన్న సినిమాలకు అందుతున్న క్రేజ్ ని చూస్తుంటే ఇండియన్ సినిమాల్లో టాలీవుడ్ కూడా టాప్ లో ఉందని చెప్పడానికి ఎంతో సమయం పట్టేలా లేదు. సినిమా విడుదల అయ్యాక కలెక్షన్స్ ఎంతవరకు అందుకుంటాయో గాని సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ మాత్రం మాములుగా లేదు. రీసెంట్ గా భరత్ అనే నేను కూడా అలాంటి రికార్డునే అందుకుంది.

మహేష్ కెరీర్ లో మరో ప్రతిస్తాత్మక చిత్రంగా భరత్ అనే నేను నిలవడం కాయమని ఇప్పటికే సినీ పండితులు వివరణ ఇచ్చారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇటీవల రిలీజ్ అయిన ద విజన్ ఆఫ్ భరత్ సినిమా యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. అత్యధిక లైకులు అందుకున్న టాలీవుడ్ టీజర్ గా రికార్డు సృష్టించింది. 526 లైకులతో మహేష్ టీజర్ టాప్ లో ఉంది. దాదాపు 15 మిలియన్ వ్యూవ్స్ అందాయి.

ఇంతకుముందు పవన్ అజ్ఞాతవాసి టీజర్ అత్యధిక లైకులు అందుకున్న మొదటి టీజర్ గా స్థానం అందుకుంటే మహేష్ తన ఇమేజ్ తో ఆ రికార్డును బ్రేక్ చేశారు. ఈ రికార్డ్ ను చూస్తుంటే సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక సినిమా తప్పకుండా శ్రీమంతుడు కంటే ఎక్కువ స్థాయిలో రికార్డు కలెక్షన్స్ అందుకుంటుందని చెప్పవచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.