Begin typing your search above and press return to search.

భ‌ర‌త్ కోసం న‌మ్ర‌త దిగిందిగా..

By:  Tupaki Desk   |   13 April 2018 3:00 PM IST
భ‌ర‌త్ కోసం న‌మ్ర‌త దిగిందిగా..
X
టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు శ్రీ‌మ‌తి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ అంత‌కు ముందు బాలీవుడ్ మోడ‌ల్ - హీరోయిన్ అని అంద‌రికీ తెలిసిందే. కానీ న‌మ్ర‌త గురించి అంద‌రికీ తెలియ‌ని విషయం మ‌రోటి ఉంది. ఆమె మంచి మార్కెటింగ్ మేనేజ‌ర్‌. ప్రిన్స్ చేసే ప్ర‌తీ పనీ వెన‌క ఆమె ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుంది. యాడ్స్ ఎంపిక‌లోనే కాదు... సినిమాల ప్ర‌మోష‌న్ విష‌యంలో కూడా...

శ్రీ‌మంతుడు సినిమా అంత‌టి అద్భుతం విజ‌యం సాధించ‌డం వెన‌క ఓ ర‌హ‌స్య మార్కెటింగ్ స్ట్రాటెజీనే ఉప‌యోగించింది న‌మ్ర‌తా. ఓ మార్కెటింగ్ టీంను తీసుకుని సోష‌ల్ మీడియా ద్వారా శ్రీ‌మంతుడు లోని సోష‌ల్ పాయింట్ ను హైలెట్ చేస్తూ విసృతంగా ప్ర‌చారం చేయించింది. సినిమా క‌లెక్ష‌న్లు డ్రాప్ అవ్వ‌కుండా స్ట‌డీగా కొన‌సాగేందుకు న‌మ్రత వ్యూహ‌మే కార‌ణం. ఆ త‌ర్వాత కూతురు బాగోగులు చూసుకోవ‌డంలో న‌మ్ర‌త బిజీ కావ‌డంతో మ‌హేష్ కు రెండు ఫ్లాపులొచ్చాయి. ఇప్పుడు ‘భ‌ర‌త్ అనే నేను’ సినిమాను ఎలాగైనా స‌క్సెస్ చేసేందుకు మ‌ళ్లీ మార్కెటింగ్ ప‌గ్గాలు చేపట్టింది న‌మ్ర‌తా. హైద‌రాబాద్ లో ఏకంగా 200 హోర్డింగుల‌ను ఏర్పాటుచేయ‌బోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి మొత్తం 350 హోర్డింగులు పెట్టాల‌ని నిర్మాత‌ని ఆదేశించింది.

ఇప్ప‌టికే భ‌ర‌త్ బ‌హిరంగ స‌భ కోసం భారీగా ఖ‌ర్చు చేశాడు నిర్మాత దాన‌య్య‌. యంగ్ టైగ‌ర్ ఎన్‌.టీ.ఆర్ ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన విష‌యం తెలిసిందే. మొత్తంగా కేవలం ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల కోసం మూడు కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాడ‌ట దాన‌య్య‌. రెండు ఫ్లాపుల త‌ర్వాత వ‌స్తున్న ‘భ‌ర‌త్ అనే నేను’ చిత్రాన్ని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డుల సృష్టించేలా ప‌క్కా ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారంతా!