Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: హిట్టుకు హామీ ఇచ్చేసాడు

By:  Tupaki Desk   |   7 April 2018 10:27 PM IST
ట్రైలర్ టాక్: హిట్టుకు హామీ ఇచ్చేసాడు
X
మహేష్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన భరత్ అనే నేను ట్రైలర్ ఇందాకా జరిగిన బహిరంగ సభలో జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయించేసారు. ఎక్కువ హైప్ లేకుండా కథను రివీల్ చేసే అవకాశం ఇవ్వకుండా చాలా తెలివిగా కట్ చేసిన ట్రైలర్ తో దర్శకుడు కొరటాల శివ బాగానే ఇంప్రెస్ చేసాడు. నిశితంగా గమనిస్తే లైట్ గా కథ అర్థమవుతుంది. పట్టభద్రుడిగా కాలేజీ నుంచి వాస్తవ ప్రపంచంలోకి వచ్చిన భరత్ అనూహ్య పరిణామాల్లో రాజకీయాల్లోకి వచ్చి ముఖ్య మంత్రి అవుతాడు. తప్పు చేయకూడదు అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మే భరత్ ఏదో మార్పు కోసం కొన్ని చేదు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దీని వల్ల ప్రతిపక్షం స్వపక్షం నుంచే కాక బయట మీడియా పబ్లిక్ నుంచి కూడా ప్రశ్నలు ఎదురుకుంటాడు. అసలు భరత్ విజన్ ఏంటి దేని కోసం ఇంత ఛాలెంజ్ ఎదురుకున్నాడు అనేది భరత్ అనే నేను మెయిన్ థ్రెడ్ గా కనిపిస్తోంది.

ట్రైలర్ మంచి ఇంటెన్సిటీ తో ఉంది. వర్తమాన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతూనే ఒక తీవ్రమైన సామాజిక సమస్య గురించి దర్శకుడు కొరటాల శివ ఇందులో గట్టి కసరత్తే చేసినట్టు కనిపిస్తుంది. దేవరాజ్-ప్రకాష్ రాజ్-రవి శంకర్ రాజకీయ నాయకులుగా అపోజిషన్ లో ఉన్నారా లేక స్వంత పార్టీలో ఉంటూ ఏదైనా రోల్ పోషించారా అనేది రివీల్ చేయలేదు. కైరా అద్వాని క్యుట్ గా ఆకట్టుకోగా తన తండ్రి పాత్రలో రావు రమేష్ కనిపించాడు. మొత్తానికి కమర్షియల్ మసాలా తగ్గకుండా సమపాళల్లో కొరటాల శివ అన్ని మిక్స్ చేసి భరత్ అనే నేను తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. తప్పును సరిచేస్తే రాచరికం గుర్తొచ్చిందా నాకు అమ్మా నాన్న గుర్తొచ్చారు అంటూ మహేష్ మొదట్లో పలికిన డైలాగ్ బాగా పేలింది.

యాక్షన్ డోస్ తగినంత దట్టించిన శివ సోషల్ మెసేజ్ మాత్రం గత సినిమాల కంటే ఇందులో ఇంకాస్త బలంగా వినిపించినట్టు కనిపిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ తన థీం మ్యూజిక్ తో ఎప్పటి లాగే ఆకట్టుకోగా ట్రైలర్ చివర్లో అసెంబ్లీని ఉద్దేశించి హౌస్ లో ఉన్న డౌట్స్ క్లియర్ అయితే నేను ఇంటికి వెళ్తాను అని తనదైన శైలిలో చెప్పడం చూస్తే ఇలాంటి గూస్ బంప్ సీన్స్ శివ ఎన్ని పెట్టాడో అనిపించేలా ఉంది. మొత్తానికి భరత్ అనే నేను హిట్టు ఇస్తున్నాను అనేలా ఉన్న ట్రైలర్ చూసి మహేష్ ఫాన్స్ ఆనందం మామూలుగా లేదు మరి

వీడియో చూడటానికి క్లిక్ చేయండి