Begin typing your search above and press return to search.

సూర్యతో భరత్ హోలీ ఫైట్

By:  Tupaki Desk   |   1 May 2018 3:19 PM IST
సూర్యతో భరత్ హోలీ ఫైట్
X
భరత్ అనే నేను రెండు వారాల దూకుడుకు వచ్చే వారం చిన్న బ్రేక్ పడనుంది. అల్లు అర్జున్ నా పేరు సూర్య మే 4 విడుదలకు సర్వం సిద్ధం చేసుకుంది. బన్నీ మొదటి సారి ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న సినిమా కావటంతో పాటు ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉండటంతో అంచనాలు మామూలుగా లేవు. అందుకే భరత్ అనే నేను మీద దాని ప్రభావం పడకుండా నిర్మాతలు కొత్త స్కెచ్ వేసారు. సినిమా విడుదల కాగానే జరిగిన మొదటి ప్రెస్ మీట్ లో మహేష్ బాబు తో పాటు దర్శకుడు కొరటాల శివ ఇందులో కీలకమైన హోలీ ఫైట్ ఒకటి ఎడిటింగ్ లో తీసేయాల్సి వచ్చిందని త్వరలో వీలు చూసుకుని యాడ్ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. నా పేరు సూర్య విడుదల కానున్న మే 4నే భరత్ అనే నేనులో హోలీ ఫైట్ కూడా జోడించబోతున్నారు.

ఇది మహేష్ ఫాన్స్ కు గుడ్ న్యూస్ కాని సినిమాను ఒక్కసారి మాత్రమే చూసే సగటు సినిమా ప్రేమికులు అదే పనిగా ఈ ఒక్క ఫైట్ కోసం మళ్ళి వెళ్తారా అంటే కాస్త అనుమానించాల్సిన విషయమే. దానికి తోడు ఇకపై వారానికో చెప్పుకోదగ్గ సినిమా వస్తూనే ఉంటుంది. ఈ నేపధ్యంలో పెద్ద టార్గెట్ పెట్టుకున్న భరత్ అనే నేను వసూళ్లు స్టడీగా ఉండటం కోసం ఈ ఎత్తుగడ తప్ప వేరే మార్గం లేదు కాని ఇది అమాంతం కలెక్షన్స్ పెంచేది కాకపోవచ్చు. అంత ఎక్స్ ట్రాడినరిగా ఉంటే అదేదో మొదట్లోనే వేరే సన్నివేశాలు తీసేసి ఇదే పెట్టేవాళ్ళుగా అనే అనుమానం కూడా రాకమానదు. ఏదైతేనేం రెండు వందల కోట్ల గ్రాస్ ని లక్ష్యంగా పెట్టుకుని దూసుకుపోతున్న భరత్ అనే నేను అది చేజ్ చేయాలంటే ఈ అదనపు ఆకర్షణ సరిపోతుందా లేదా అనేది ఇంకో నాలుగు రోజులలో తేలిపోతుంది. గతంలో మిర్చి, శ్రీమంతుడు విషయంలో కొరటాల శివ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. ఈసారైనా వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.