Begin typing your search above and press return to search.

భరత్ లో ఈ సీన్ పడుంటేనా

By:  Tupaki Desk   |   5 May 2018 11:00 PM IST
భరత్ లో ఈ సీన్ పడుంటేనా
X
మహేష్ బాబు లేటెస్ట్ మూవీ థియేటర్లలో విపరీతంగా హంగామా చేస్తోంది. మూవీ రిలీజ్ అయ్యి రెండువారాలు పూర్తి కావడంతో.. సందడి కాసింత తగ్గినా ఇప్పటికే బ్లాక్ బస్టర్ అంటూ జనాల్లోకి వెళ్లిపోయిన సినిమా ఇది. ఈ మూవీ ఇంకా సేఫ్ జోన్ లోకి వచ్చేందుకు కాసింత కలెక్షన్స్ అవసరం అవుతుంది.

దీంతో భరత్ కు మరింతగా బజ్ క్రియేట్ చేసేందుకు ఈ సినిమా నుంచి ఎడిటింగ్ టైంలో కట్ చేసిన సీన్స్ ను ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. వీటిలో ఒకటి ఇప్పుడు విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది. ఎడ్యుకేషన్ కు సంబంధించి సినిమాలో కొంత ఎపిసోడ్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయాలనే కాన్సెప్ట్ ఉంటుంది. మరి ఇది ప్రైవేట్ స్కూల్స్ కు దెబ్బ కదా. అందుకే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు సీఎం భరత్ దగ్గరకు వచ్చి తమకు బిజినెస్ దెబ్బ తింటుందంటూ మాట్లాడుతారు. అయితే.. మీకు ఏమైనా కావాలంటే ఇచ్చేస్తామంటూ స్కూల్ యాజమాన్యాలు చెప్పడంతో.. లాగి చెంప మీద ఒక్కటిచ్చుకుంటాడు మహేష్ బాబు.

ఈ సీన్ యూట్యూబ్ లోనే ఇంత పర్ఫెక్ట్ గా ఉంటే.. థియేటర్లలో కచ్చితంగా పేలేది. ఇందుకు కారణం.. ఈ సీన్ లో చూపినట్లుగా ప్రైవేట్ స్కూల్స్ దందా జరుగుతోంది. పైగా మినిస్టర్ లెవెల్ లో ఉన్నవారు స్కూల్ యాజమాన్యం హోదా నుంచి వచ్చిన వారే. బహుశా వారితో విబేధాలు ఎందుకులే అనే ఉద్దేశ్యంతోనే ఈ సన్నివేశాన్ని తొలగించి ఉంటారని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి