Begin typing your search above and press return to search.
‘భరత్’లో తీసేసిన సీన్లు ఎలా ఉన్నాయ్?
By: Tupaki Desk | 5 May 2018 5:07 AM GMTషూటింగ్ టైంలో ప్రతిదీ మంచి సీనే అనిపిస్తుంది. కానీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర కొన్ని సీన్లు చేదైపోతుంటాయి. ఆ సన్నివేశాలు నచ్చకపోవడం వల్ల కావచ్చు.. నిడివి ఎక్కువ కావడం వల్ల కావచ్చు.. కత్తెర వేటుకు గురవుతుంటాయి. ‘భరత్ అనే నేను’ నుంచి కూడా కొన్ని సీన్లు అలాగే ఎగిరిపోయాయి. ‘శ్రీమంతుడు’ తరహాలో వాటిని థియేటర్లలో సినిమాకు కలుపుతారని అనుకున్నారు. కానీ ఇప్పటికే 2 గంటల 53 నిమిషాల నిడివి ఉన్న నేపథ్యంలో ఇవి కూడా కలిపితే కష్టమైపోతుందని ఆగిపోయారు. వాటిని నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఒకేసారి ఇలా నాలుగు సీన్లు యూట్యూబ్ లోకి రావడం విశేషం.
అందులో అసెంబ్లీ సీన్ హైలైట్ అని చెప్పాలి. సీఎం భరత్ బడ్జెట్ విషయంలో ఆలస్యం చేస్తుంటే ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి. ఐతే దానికి ఇంకా కొంత సమయం కావాలంటాడు.. అతను చేతకాని వాడని ఎద్దేవా చేస్తుంది ప్రతిపక్షం. అసలు విషయం ఏంటంటే.. గత బడ్జెట్లను స్టడీ చేసి జరిగిన మోసాన్ని గుర్తించడానికే భరత్ అంత సమయం తీసుకుంటాడు. గత ఐదేళ్ల బడ్జెట్లపై సోషల్ ఆడిట్ చేయాలన్న నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. దీంతో అటు ప్రతిపక్షం.. ఇటు అధికార పక్షం నిర్ఘాంతపోతాయి. ఈ క్రమంలో వచ్చే డైలాగులు భలేగా పేలాయి. సమకాలీన రాజకీయాలు, ప్రభుత్వాల పనితీరుపై కొరటాలకు ఉన్న సునిశిత పరిశీలన ఈ సీన్లో కనిపిస్తుంది.
ఇక మిగతా మూడింట్లో ప్రైవేటు స్కూల్స్ యజమానులతో మీటింగ్ సీన్ హైలైట్ అని చెప్పాలి. ప్రైవేటు పాఠశాలలపై ఉక్కుపాదం మోపిన భరత్ దగ్గరికి రాజీ ప్రయత్నాల కోసం వస్తారు యజమానులు. వాళ్లకు కటువుగా సమాధానం చెబుతాడు. చివర్లో ఒక యజమాని లంచం ఆఫర్ చేయబోతే చెంప చెళ్లుమనిపిస్తాడు. ఈ రెండు సీన్లూ సినిమాలో ఉంటే క్లాప్స్ పడేవే. ఇంకా రాయలసీమకు వెళ్లినపుడు అక్కడ ఓ రైతుతో భరత్ మాట్లాడి అతడి దైన్యం గురించి తెలుసుకునే సీన్.. గ్రామసభలో నాలుగో సంతానానికి సిద్ధ పడ్డ మహిళను సున్నితంగా హెచ్చరించే రెండు చిన్న సీన్లు కూడా ఉన్నాయి. మొత్తంగా నాలుగు సీన్లూ ఎఫెక్టివ్ గానే అనిపిస్తున్నాయి
వీడియో 1
వీడియో 2
వీడియో 3
వీడియో 4