Begin typing your search above and press return to search.
పవన్ అనుకుంటే మహేష్ సీఎం అయ్యాడు
By: Tupaki Desk | 22 March 2018 6:19 AM GMTపవన్ కళ్యాణ్ ఇప్పుడు అంటే సినిమాలు చేయనని తెగేసి చెప్పేశాడు కానీ.. తను సినిమాలు చేస్తున్నపుడే అనేక మంచి సబ్జెక్టులను వదిలేశాడు. మహేష్ బాబు నటించిన అతడు.. పోకిరి సినిమాలు మొదట పవన్ కళ్యాణ్ కు వినిపించినవే. వచ్చే నెలలో రిలీజ్ కానున్న మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను కూడా పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథే అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సహజంగా తన స్టోరీలను తానే రాసుకునే కొరటాల శివ.. భరత్ అనే నేను విషయంలో మాత్రం ఏకంగా రూ. 1 కోటిని శ్రీహరి నానుకు చెల్లించి మరీ కథ కొనుక్కున్నాడు. ఇందుకు కారణం.. ఈ సబ్జెక్ట్ పై ఉన్న నమ్మకమే. ఈ స్టోరీని పవర్ స్టార్ కోసమే రాసుకున్నట్లు కొత్త విషయం చెబుతున్నాడు శ్రీహరి నాను. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత వచ్చిన ఆలోచనతోనే ఈ కథ తయారు చేశాడట. అలాగే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందనే స్ఫూర్తితోనే ఈ స్టోరీని సిద్ధం చేశానని చెప్పాడు ఈ రైటర్.
అంతే కాదు.. ఈ కథను పవన్ కు కూడా వినిపించగా.. తన ముఖ్యమంత్రి అయేందుకు పార్టీ పెడుతున్నాననే రాంగ్ సిగ్నల్స్ ను జనాలకు పంపుతుందని ఫీలయ్యాడట పవన్. అయితే స్టోరీ బాగుందని మాత్రం ప్రశంసించాడట. ఆ తర్వాతే కొరటాల రంగంలోకి దిగి.. ఈ కథకు తన స్టైల్ మెరుగులు అద్ది భరత్ అనే నేను చిత్రాన్ని సాకారం చేశాడు.