Begin typing your search above and press return to search.
భరత్ ఎంత తేవాలో తెలుసా?
By: Tupaki Desk | 19 April 2018 10:28 AM ISTమహేష్ బాబు సినిమాలు అంటే.. హిట్టు ఫ్లాపు ట్రాక్ రికార్డ్ తో సంబంధం లేకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. రేపు రిలీజ్ అవుతున్న భరత్ అనే నేను మూవీకి కూడా మహేష్ గత చిత్రాలతో పోల్చితే బిజినెస్ ఎక్కువగానే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ను 100 కోట్లకు విక్రయించారంటే ఈ సినిమాపై ఉన్న అంచనాలు అర్ధమవుతాయి.
ఏరియాల వారీగా చూస్తే.. నైజాం హక్కులను 22 కోట్ల రూపాయలకు విక్రయించారు. సీడెడ్ 12.6 కోట్లు - వైజాగ్ 8.2 కోట్లు - ఈస్ట్ 6.7 కోట్లు - వెస్ట్ 6 కోట్లు - కృష్ణా ప్లస్ గుంటూరు 13.5 కోట్లు - నెల్లూరు 3.0 కోట్లు పలకడంతో.. రెండు తెలుగురాష్ట్రాల వరకే భరత్ అనే నేను థియేట్రికల్ హక్కుల లెక్క 72కోట్లుగా తేలింది. కర్నాటక 8.2 కోట్లు - రెస్టాఫ్ ఇండియా 1.6 ఓవర్సీస్ 18.2 కోట్లు పలకడంతో.. వరల్డ్ వైడ్ గా 100 కోట్ల రూపాయల బిజినెస్ ను మహేష్ మూవీ సాధించినట్లు అయింది.
ఇక తెలుగు శాటిలైట్ హక్కులను ఏకంగా 22.5 కోట్లకు విక్రయించగా.. హింది డబ్ రూపంలో 15.5 కోట్ల సమకూరాయి. ఆడియో ప్లస్ ఇతరాలు 2 కోట్లు కాగా.. మొత్తం 140 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ ను మహేష్ మూవీ చేసింది. ఇప్పుడ చిత్రం హిట్టు రేంజుకు చేరుకోవాలంటే.. షేర్ రూపంలోనే 105 కోట్ల వరకూ వచ్చి తీరాలి. అంటే ఇండస్ట్రీ హిట్ కొట్టి తీరాలన్న మాట. మహేష్ కెరీర్ బెస్ట్ అయిన శ్రీమంతుడును 20 శాతం మార్జిన్ తో అధిగమిస్తేనే ఇది సాధ్యం అవుతుంది. అయితే.. ప్రస్తుతం మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ అందుకుని మంచి టాక్ వస్తే.. ఇదేమంత కష్టం కాకపోవచ్చు.