Begin typing your search above and press return to search.

ఆ న‌డుము ఊపుతో చంపేసిందంతే!

By:  Tupaki Desk   |   9 May 2019 5:59 PM GMT
ఆ న‌డుము ఊపుతో చంపేసిందంతే!
X
స‌ల్మాన్ ఖాన్- క‌త్రిన జంట బాలీవుడ్ లోనే స‌క్సెస్ ఫుల్ పెయిర్ అన్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట‌ రొమాన్స్ ఏ రేంజులో వ‌ర్క‌వుట‌వుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. కెరీర్ ఆరంభం నుంచి ఆఫ్ ద స్క్రీన్ .. ఆన్ ద స్క్రీన్ వైఫ్ & హ‌జ్బెండ్ లా క‌లిసిపోయి ఈ జోడీ కెమిస్ట్రీ పండించిన విధానం ఫ్యాన్స్ లో నిరంత‌రం హాట్ టాపిక్. రియాలిటీలోనూ ఈ జంట మ‌ధ్య ల‌వ్ స్టోరి ఎంతో ఆస‌క్తిక‌రం.చాలాకాలం ప్రేమాయ‌ణం సాగించి అటుపై బ్రేకప్ అయ్యి.. ఆ ఇద్ద‌రూ ఎవ‌రికి వారు రూటు మార్చి కొత్త స్నేహాలు వెతుక్కోవ‌డం.. కొత్త ప్రేమ‌ల్ని వెతుక్కోవ‌డం .. అటుపై చాలా గ్యాప్ త‌ర్వాత తిరిగి క‌లుసుకుని ఎంతో సాన్నిహిత్యాన్ని మెయింటెయిన్ చేయ‌డం.. పాత స్నేహితుడిని ఇక ఎప్ప‌టికీ వ‌దులుకోలేను అన్నంత‌గా క‌త్రిన అత‌డితో క‌లిసిపోవ‌డం ఇదంతా ఓ పెద్ద మెలోడ్రామా అనే చెప్పాలి.

రీయునైట్ అయ్యాక ఈ జంట న‌టించిన `టైగ‌ర్ జిందా హై` చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ కొట్టింది. దాదాపు 500 కోట్లు పైగా వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఇదే ఊపులో అలీ అబ్బాస్ జాఫ‌ర్ తిరిగి ఈ జోడీని క‌లుపుతూ ప్ర‌స్తుతం భార‌త్ అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా స‌ల్మాన్ భాయ్ - క‌త్రిన‌పై చిత్రీక‌రించిన ఎతయా పాట‌ను సామాజిక మాధ్య‌మాల్లో రిలీజ్ చేశారు. ఈ పాట‌లో క‌త్రిన లుక్ ... చీర‌క‌ట్టు యువ‌త‌రం గుండెల్లో గిలిగింత‌లు పెట్ట‌డం ఖాయం.

డిజిట‌ల్ డేస్ లో మారుతున్న ట్రెండ్ కి త‌గ్గ‌ వెడ్డింగ్ పాట ఇది. ఈ పాట‌లో స‌ల్మాన్ - క‌త్రిన ఎక్స్ ప్రెష‌న్స్ మైండ్ బ్లోయింగ్. ట్యూన్ కి త‌గ్గ‌ట్టే భాయ్ అద్భుత‌మైన ఆహార్యం క‌న‌బ‌రిస్తే.. ఆ రింగుల జుత్తుతో క‌త్రిన చేసిన మాయ మామూలుగా లేదు. క‌త్రిన న‌డుము ఊపుతూ చేస్తున్న ఆ ప్ర‌త్యేక నృత్యం కంటికి కునుకు ప‌ట్ట‌నిస్తుందా అన్న‌ది సందేహ‌మే. భార‌త్ చిత్రం ఈద్ కానుక‌గా జూన్ 5న రిలీజ్ కానుంది. టైగ‌ర్ జిందా హై ఘ‌న‌విజ‌యం నేప‌థ్యంలో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలేర్పడ్డాయి. ప్ర‌స్తుతం ప్ర‌చారం ప‌రంగా టీమ్ వేడి పెంచుతున్న సంగ‌తి తెలిసిందే.