Begin typing your search above and press return to search.
భారతీరాజా మేకింగ్ స్టైల్ కనిపిస్తుంది!-చిరంజీవి
By: Tupaki Desk | 7 Feb 2021 4:41 AM GMTమెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ `ఉప్పెన` ఫిబ్రవరి 12న విడుదలవుతున్న సంగతి తెలిసినదే. థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతించాక ఘనంగా రిలీజ్ కి ప్లాన్ చేసింది చిత్రబృందం. శనివారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ప్రీరిలీజ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఉప్పెన కథ సహా నటీనటులు సాంకేతిక నిపుణులపై చిరు ప్రశంసలు కురిపించారు.
వేదికపై చిరు మాట్లాడుతూ-``దర్శకుడు బుచ్చిబాబు పూర్తి కథనం చెప్పిన తర్వాత ఉప్పెన గురించి తన ఉత్సాహాన్ని పంచుకునేందుకు ప్రెస్ మీట్ పెట్టాలని భావించాను. కానీ అతను నన్ను ఆపాడు. ఉప్పెన ఒక అద్భుత దృశ్యకావ్యం.. ప్రేమ ఉద్వేగాల కవిత్వం`` అని అన్నారు. చమత్కారమైన స్క్రీన్ ప్లేతో గొప్ప ఇతిహాసంగా మారుతుందని భావించినప్పుడు తాను షాక్ అయ్యానని చిరు చెప్పారు. ఉత్తమ స్క్రీన్ ప్లేకి ఉప్పేనా ఒక బెంచ్ మార్క్ అవుతుందని దర్శకుడు ఒక ప్రమాదకర పాయింట్ ను ఎంచుకుని ఎలా చూపించాడోనన్న ఆసక్తి కలిగిందని తెలిపారు. సస్పెన్స్ ను నిలబెట్టడం సరైన సమయంలో బహిర్గతం చేసే ప్రతిభ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. స్క్రీన్ ప్లే సహా సన్నివేశాల గురించి మరింత తెలుసుకోవడానికి ప్రతి టెక్నీషియన్ ఈ సినిమా చూడాలనుకుంటున్నారని చిరంజీవి అన్నారు. 90లలో భారతి రాజా మేకింగ్ స్టైల్ కనిపిస్తుందని చిరు గుర్తుచేసుకున్నారు. బుచ్చిబాబు చెప్పిన కథలో నేను ఏదీ దిద్దలేకపోయానని అన్నారు చిరు. మైత్రి మూవీ మేకర్స్ కి ఉప్పెన మరో రంగస్థలం కావాలని మెగాస్టార్ ఆకాంక్షించారు.
నాకు లీక్ చేసే అలవాటుంది. కానీ నేను ఉప్పెన నుంచి ఏమీ లీక్ చేయను (నవ్వుతూ దర్శకుడి వైపు తిరిగి) అని అన్నారు. సేతుపతి దేశంలోనే గొప్ప నటుడని.. తమిళంలో పూజిస్తారని కూడా అన్నారు. విజయ్ సేతుపతి పోషించిన భవానీ పాత్రతో ప్రేమలో పడ్డాను అని కూడా చిరు వ్యాఖ్యానించారు. వేదికపై దేవీశ్రీ సహా పేరు పేరునా ప్రతి టెక్నీషియన్ ని చిరంజీవి ప్రశంసించారు.