Begin typing your search above and press return to search.
ఇళయరాజాపై భారతీరాజా షాకింగ్ కామెంట్స్!
By: Tupaki Desk | 30 Jan 2018 1:19 PM GMTతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాగానే ఆయనపై విమర్శల దాడి మొదలైన సంగతి తెలిసిందే. ఆయన స్థానికుడు కాదని, ఆయనకు తమిళ ప్రజల మద్దతుండదని ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా - భారతీరాజా.....ప్రముఖ సంగీత దర్శకుడు - పద్మవిభూషణ్ ఇళయరాజా పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఇళయరాజాకు పద్మభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనపై భారతీరాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆయన దళితుడు కావడం వల్లనే ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందంటూ ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే, ఇళయరాజా బ్రాహ్మణుడు కావాలనుకుంటున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి ఇళయరాజా - భారతీరాజా ఒకే ఊరికి చెందినవారు. ఇద్దరూ దాదాపుగా ఒకేసారి సినీ రంగంలో అడుగుపెట్టి ఉన్నత శిఖరాలకు ఎదిగారు. ఈ లెజెండ్ లు ఇద్దరు ప్రాణ స్నేహితులు. అయితే, వీరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. `ఇళయరాజా దళితుడు కావడం వల్లే అతడికి `పద్మవిభూషణ్` వచ్చింద`ని ఓ పత్రిక కథనం రాసింది. అది వివాదస్పదం కావడంతో క్షమాపణలు చెప్పింది. ఆ విషయంపై భారతీరాజా ఓ సభలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇళయరాజా దళితుడు కావడం వల్లే అవార్డు వచ్చిందని కొందరు అంటున్నారని, కానీ, ఇళయరాజా బ్రాహ్మణుడు కావాలని ప్రయత్నిస్తున్నాడని అన్నారు. అయితే, భారతీరాజా వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా ఘాటుగా స్పందించారు. `అయ్యర్ అంటే ఉపాధ్యాయుడు, గౌరవింపదగిన వాడు అని, ఆ రకంగా ఇళయరాజా ఇప్పటికే అయ్యర్ అని ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇళయరాజా స్పందన ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.