Begin typing your search above and press return to search.
ఒకేసారి జయలలితపై మూడు బయోపిక్ లు
By: Tupaki Desk | 19 Aug 2018 5:52 AM GMTఇది అలాంటిలాంటి కన్ఫ్యూజన్ కాదు! కన్ఫ్యూజన్ లో కెళ్లా కన్ఫ్యూజన్. ఒక ప్రముఖ వ్యక్తిపై బయోపిక్ తీస్తున్నారంటే ఏదో ఒక సినిమా తీస్తున్నారులే అనుకుంటాం. కానీ ఇక్కడ ఒకే వ్యక్తి జీవితంపై ముగ్గురు సినిమాలు తీసేందుకు రెడీ అవుతూ అందరినీ కన్ఫ్యూజన్ లోకి నెట్టేశారు. ఆ ముగ్గురూ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా బయోపిక్ పై ప్రకటనలు గుప్పించేస్తున్నారు. అలా ఒకేసారి దివంగత ముఖ్యమంత్రి జయలలితపై మూడు బయోపిక్ లు సెట్స్ పైకి వెళుతున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం స్క్రిప్టు దశలో ఉన్నాయి.
ఈ బయోపిక్ లన్నిటికీ యాథృచ్ఛికంగా ఫిబ్రవరి 24 ముహూర్తం నిర్ణయించారని కోలీవుడ్ లో చర్చ సాగుతోంది. ఆరోజు జయలలిత జయంతి సందర్భంగా సినిమాని ప్రారంభించి రెగ్యులర్ చిత్రీకరణలకు వెళ్లిపోతారట. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ నిర్మాత విష్ణు ఇందూరి జయలలిత బయోపిక్‌ని నిర్మిస్తున్నామని ప్రకటించారు. జయంతిరోజున ప్రారంభోత్సవం అని తెలిపారు. ఈ బయోపిక్ తో పాటు తమిళ ఫిలింమేకర్ ప్రియదర్శిని `జయా` అనే టైటిల్ తో వేరొక బయోపిక్ ని నిర్మిస్తున్నారని తెలిసింది. ఇది కూడా అమ్మ జయంతి రోజునే ప్రారంభోత్సవం జరుపుకోనుంది.
ఇక మూడో బయోపిక్ గురించి లేటెస్టుగా సమాచారం అందింది. ఈ బయోపిక్ ని నిర్మించేది కోలీవుడ్ వెటరన్ ఫిలింమేకర్ భారతీరాజా కావడంతో అందరిలో ఒకటే ఉత్కంఠ నెలకొంది. భారతీరాజా అమ్మ బయోపిక్ కి స్వయంగా దర్శకత్వం వహిస్తారని - ఆదిత్య భరద్వాజ్ నిర్మిస్తారని చెబుతున్నారు. ఈ టీమ్ ఇళయరాజాని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకోవడంతో ఇక ఇది ఖాయమైనట్టేనన్న చర్చ సాగుతోంది. మొత్తానికి ముగ్గురు నిర్మాతలు .. మూడు స్క్రిప్టులు పట్టుకుని ఒకే ప్రముఖ వ్యక్తిపై బయోపిక్ లు తీస్తామంటూ తిరిగేస్తుంటే అమ్మ అభిమానులు కంగారు పడిపోతున్నారు. ఇలా అయితే అమ్మ ఆత్మ స్వయంగా బరిలో దిగి ఎవరో ఒకరినే ఎంపిక చేసుకోవాలేమో?