Begin typing your search above and press return to search.
అసలు ఈ భారతీసింగ్ ఎవరు ?
By: Tupaki Desk | 24 Nov 2020 11:30 AM GMTబాలీవుడ్లో డ్రగ్స్‌కేసు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఇప్పటికే పలువురు నటీమణులు ఈ కేసులో ఇరుక్కున్నారు. రియా చక్రవర్తి ఇప్పటికే జైల్లో ఉన్నారు. ప్రముఖ కమెడియన్ భారతీ సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియా డ్రగ్స్ కేసులో ఇరుక్కొన్నారు. భారతీసింగ్ ఇంట్లో, ప్రొడక్షన్ హౌస్‌లో జరిపిన తనిఖీల్లో 86.5 గ్రాముల గంజాయి పట్టుబడింది. అయితే ఈ కేసులో వాళ్లకు ఇప్పటికే బెయిల్ వచ్చింది. తాము గంజాయి తీసుకున్నట్టు వీళ్లిద్దరూ పోలీసుల ఎదుట అంగీకరించారట. దీంతో అసలు ఈ భారతీసింగ్ ఎవరు ? ఆమె టీవీ ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారన్న విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. తాజాగా ఈ దంపతులకు ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
'దగ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్', 'కామెడీ సర్కస్' తో ఆమె పాపులర్ అయ్యారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన భారతీసింగ్ 12 ఏళ్లుగా టీవీరంగంలో ఉన్నారు. పేదకుటుంబంలో పుట్టిన భారతీసింగ్ అంచెలంచెలుగా ఎదిగారు. చిన్నవయసులోనే ఆమె తండ్రి మరణించారు. తల్లి కుట్టుమిషన్ కుట్టి కుటుంబాన్ని పోషించింది. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో భారతీ చెప్పి వేదన చెందారు. భారతీసింగ్ కు విలువిద్యలో కూడా నైపుణ్యం ఉంది. కానీ కుటుంబపరిస్థితుల వల్ల ఆమె ఆ రంగంలో రాణించలేకపోయారు. భారతీ సింగ్ 'ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్' రియాలిటీ షోతో తన కెరీర్ ప్రారంభించారు.
అయితే భారతీసింగ్ గతంలో డ్రగ్స్ తీసుకోవద్దంటూ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది. ఇదేంటీ భారతీ జీ..! అంటూ పలువురు నెటిజన్లు ఆమె పాత ట్వీట్‌ను, ప్రస్తుత ఘటనను పోల్చుతూ ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు భారతీసింగ్ ఓ పేదకుటుంబంనుంచి రావడంతో ఆమెకు అభిమానులు ఎక్కువగా ఉన్నారు. వారంతా భారతీ పై ప్రస్తుతం సానుభూతి చూపుతున్నారు. భారతీ భర్త హర్ష్ లింబాచియా స్క్రిప్ట్ రైటర్.ఆయన ఎన్నో కామెడీ స్కిట్లను రూపొందించారు. భారతీ సింగ్ అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలంగా మారింది. ఎన్సీబీ వాళ్లు పలుకుబడి ఉన్నవాళ్లన వదిలేసి.. భారతీసింగ్ లాంటి వాళ్లను పట్టుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి.