Begin typing your search above and press return to search.
బన్నీ - భాస్కర్ కలిసి మళ్ళీ పరుగు పెట్టబోతున్నారా...?
By: Tupaki Desk | 2 May 2020 10:34 AM GMTబొమ్మరిల్లు భాస్కర్.. 'బొమ్మరిల్లు' సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమై సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న దర్శకుడు. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుని స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ తరువాత అల్లు అర్జున్ హీరోగా 'పరుగు' సినిమాతో ఓకే అనిపించాడు. కానీ ఆ తర్వాత భాస్కర్ కెరీర్ పూర్తిగా గాడి తప్పింది. వరుస ఫ్లాప్ లు ఈ యంగ్ డైరెక్టర్ కెరీర్ ను కష్టాల్లో పడేసింది. ముఖ్యంగా రామ్ చరణ్ తో తెరక్కించిన ‘ఆరెంజ్’ సినిమా భాస్కర్ ని కోలుకోలేని దెబ్బకొట్టింది. చివరిగా ఎనర్జిటిక్ హీరో రామ్ తో ‘ఒంగోలు గిత్త’ సినిమాను తెరకెక్కించారు. ఇది కూడా బోల్తా కొట్టింది. దీంతో భాస్కర్ చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆరేళ్ల గ్యాప్ తరవాత అక్కినేని అఖిల్ హీరోగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా తెరకెక్కిస్తున్నాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకి బన్నీ వాసు - వాసు వర్మలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. లాక్ డౌన్ లేకుండా ఉంటే సినిమా విడుదల అయ్యేది కూడా. లాక్ డౌన్ ఎత్తివేసి షూటింగ్స్‌కు ఓకే చెప్పిన వెంటనే ఆ బ్యాలన్స్ వర్క్ పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేయనున్నారు.
అయితే బొమ్మరిల్లు భాస్కర్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా రిలీజ్ అవ్వకముందే మెగా కాంపౌండ్ లో మరో సినిమా చేయడానికి అంగీకరించాడట. వరుస పరాజయాలను చవిచూస్తూ హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లు శిరీష్ తో సినిమా చేయబోతున్నాడట. నటుడుగా ఓకే అనిపించుకున్న శిరీష్ ని ఎలాగైనా హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో అల్లు అరవింద్ ఉన్నట్లు తెలుస్తుంది. వరుసగా చిత్రాలు చేయడం కంటే మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంలోనే ఆయన ఉన్నాడట. నిన్న మొన్నటి వరకు పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్న అల్లు శిరీష్ తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ కథకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆరేళ్ళ గ్యాప్ వచ్చినా ఇద్దరు హీరోలను నిలబెట్టే బాధ్యత నెత్తిమీదకెత్తుకున్నాడు భాస్కర్. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా సూపర్ హిట్ గా నిలిస్తే మరో మెగా హీరో కూడా బొమ్మరిల్లు భాస్కర్ కి ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడట. అతనెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'పరుగు' సినిమా పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు భాస్కర్ సక్సెస్ ట్రాక్ ఎక్కితే మళ్ళీ ఇద్దరు కలిసి పరిగెత్తే ఛాన్స్ ఉందట. మరి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని బొమ్మరిల్లు భాస్కర్ వినియోగించుకుంటాడో లేదో చూడాలి.