Begin typing your search above and press return to search.

క్రిస్మస్ 2020: క‌పూర్ - భ‌ట్స్ విందు.. పెళ్లికి వేళాయెనా!

By:  Tupaki Desk   |   26 Dec 2020 5:30 PM GMT
క్రిస్మస్ 2020: క‌పూర్ - భ‌ట్స్ విందు.. పెళ్లికి వేళాయెనా!
X
పండ‌గ‌ల స‌మ‌యంలో స్టార్లు త‌మ స్నేహితుల్ని పిలిచి మ‌రీ పార్టీలు చేసుకోవ‌డం చూసేదే. ఈ క‌ల్చ‌ర్ బాలీవుడ్ లో మ‌రీ ఎక్కువ‌. ఈసారి క్రిస్మ‌స్ వేడుక‌ల సంద‌ర్భంగా మ‌న హీరోలు సాటి హీరోల‌కు కొన్ని కానుక‌లు పంప‌డం చూశాం. కానీ బాలీవుడ్ లో అలా కాకుండా కుటుంబ స‌మేతంగా స్నేహితుల్ని ఆహ్వానించి ఆత్మీయ విందుల్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఈసారి బాలీవుడ్ బ‌డా ఫ్యామిలీ క‌పూర్స్ ని శుక్రవారం రాత్రి భ‌ట్స్ ఆత్మీయ విందుకు పిలిచారు. క‌పూర్ - భ‌ట్స్ పార్టీ ప్ర‌స్తుతం ఫిలింస‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ద‌ర్శ‌క‌నిర్మాత మహేష్ భట్ .. అతని భార్య నటి సోని రజ్దాన్.. వారి కుమార్తె అలియా భట్ ... ప్రియుడు రణబీర్ కపూర్ అతని కుటుంబ సభ్యులను క్రిస్మస్ సందర్భంగా విందు కోసం ఆహ్వానించారు. వారి కలయికకు సంబంధించిన‌ చిత్రాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. రణబీర్ కపూర్ ‌తో పాటు అతని తల్లి.. నటి నీతు కపూర్.. సోదరి రిద్దిమా కపూర్ సాహ్ని...ఆమె భర్త భారత్ సాహ్ని .. వారి కుమార్తె సమారా ఉన్నారు.

అలియా భట్.. ఆమె సోదరి షాహీన్.. సోని రజ్దాన్.. నీతు కపూర్ .. రిద్దిమా.. సమారా .. మహేష్ భట్ బ్లాక్ డ్రెస్ లో విందుకు విచ్చేశారు. విందు కోసం రణబీర్ కపూర్ డెనిమ్ చొక్కా జీన్స్ ధరించాడు. వారి నిర్మాత అయాన్ ముఖర్జీ కూడా శుక్రవారం సాయంత్రం కపూర్స్ భ‌ట్స్ తో పార్టీలో చేరారు. రణబీర్ కపూర్ షాహీన్ భట్ చెంపపై పెక్ (గోముగా ముద్దు) ఇచ్చిన ఫోటో వైర‌ల్ గా మారింది. క్రిస్మ‌స్ వేళ ఈ పార్టీ ఎంతో ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. అన్న‌ట్టు అన్నీ కుదిరితే ప్రేమికులు ర‌ణ‌బీర్ - ఆలియాకు పెళ్ల‌య్యేదే. కానీ క‌రోనా మ‌హ‌మ్మారీ స‌హా ర‌ణ‌బీర్ ఇంట్లో విషాదం కూడా ఆ పెళ్లిని వాయిదా వేయ‌డానికి కార‌ణం అని తెలుస్తోంది. ర‌ణ‌బీర్ ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించారు.