Begin typing your search above and press return to search.

'భవధీయుడు' సాంగ్స్ దుమ్మురేపేస్తాయట!

By:  Tupaki Desk   |   8 Jan 2022 9:30 AM GMT
భవధీయుడు సాంగ్స్ దుమ్మురేపేస్తాయట!
X
పవన్ కల్యాణ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'గబ్బర్ సింగ్' ఒకటిగా కనిపిస్తుంది. ఇటు యూత్ నుంచి .. అటు మాస్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. హరీశ్ శంకర్ దర్శకత్వం .. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పవన్ లుక్ దగ్గర నుంచి మొదలుపెడితే ప్రతి అంశానికి ఒక విశేషాన్ని జోడిస్తూ ఈ కథను హరీశ్ ముందుకు తీసుకుని వెళ్లాడు. ఇక సినిమా మ్యూజికల్ హిట్ గా నిలబడటానికి దేవిశ్రీ తనవంతు ప్రయత్నం చేశాడు. అప్పట్లో ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలే వినిపించేవి.

'దేఖో దేఖో గబ్బర్ సింగ్' .. 'దిల్సే దిల్సే' వంటి ఫాస్టు బీట్లు, 'ఆకాశం అమ్మాయైతే' అనే మెలోడీ యూత్ ను ఒక ఊపు ఊపేశాయి. మందుబాబులం .. పిల్లా నువ్వులేని జీవితం .. కెవ్వుకేక పాటలు మాస్ ఆడియన్స్ పై మంత్రల్లా పనిచేశాయి. అలాంటి ఈ ముగ్గురి కాంబినేషన్లో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు రెడీ అవుతున్నాయి. ఒక వైపున హరీశ్ శంకర్ .. మరో వైపున దేవిశ్రీ ప్రసాద్ తమ పనులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాను గురించి మాట్లాడాడు.

'గబ్బర్ సింగ్' తరువాత పవన్ - హరీశ్ శంకర్ తో కలిసి పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 'గబ్బర్ సింగ్' బ్లాక్ బస్టర్ హిట్ కావడం వలన, పవన్ అభిమానులంతా కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు. ఆ అంచనాలకి ఎంతమాత్రం తగ్గని అవుట్ పుట్ ఈ సారి మా దగ్గర నుంచి వెళ్లాలంటే, ఇంతకుముందు కన్నా ఎక్కువగా మేము కష్టపడాలి. ఇప్పటికే నేను కొన్ని సాంగ్స్ చేశాను. చాలా ఎనర్జిటిక్ గా .. మెలోడియస్ గా ఈ ఆల్బమ్ ఉంటుంది. పవన్ కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగు స్టార్ట్ అవుతుందా అనే ఉత్సాహంతో ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది" అని చెప్పుకొచ్చాడు.

ఇక పవన్ కల్యాణ్ విషయానికి వస్తే రీసెంట్ గా ఆయన 'భీమ్లా నాయక్' సినిమా షూటింగును పూర్తిచేశారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన 'హరి హర వీరమల్లు' సినిమాను చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. త్వరలోనే మళ్లీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి పవన్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి తన పోర్షన్ ను పూర్తిచేసిన తరువాతనే ఆయన 'భవధీయుడు భగత్ సింగ్' ప్రాజెక్టుపైకి వెళ్లనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది.