Begin typing your search above and press return to search.

జీవితం కిందపడేసినా నేను లేవగలను -భావన

By:  Tupaki Desk   |   1 March 2017 5:40 AM GMT
జీవితం కిందపడేసినా నేను లేవగలను -భావన
X
అసలు ఆ రోజు కారులో ఏం జరిగిందో కరక్టుగా తెలియదు కాని.. కొందరు ఆగంతకులు హీరోయిన్ భావన జీవితంపై చెరిగిపోని కొన్ని గాయాలను చేశారు. అందుకే ఆమె సినిమాలకు స్వస్తి పలుకుతోందని అందరూ అనుకున్నారు. కాని ఎంతో ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్న భావన.. తిరిగి కేవలం నాలుగు రోజుల్లో హీరో పృథ్వీరాజ్ తో తాను చేస్తున్న కొత్త సినిమా షూటింగ్ కు వచ్చేసింది. ఈ సందర్భంగా ఆమె ఫేస్ బుక్ లో ఒక కామెంట్ చేసి.. తాను ఎంత స్ర్టాంగ్ మహిళాగా ఉందనే విషయం చెప్పకనే చెప్పింది.

''నన్ను జీవితం చాలాసార్లు క్రింద పడేసింది. నేను చూడకూడదు అనుకున్న విషయాలను నాకు పరిచయం చేసింది. బాధలను చూపించింది. ఓటమిని ఇచ్చింది. అయినాసరే నేను క్రింద పడిన ప్రతీసారి పైకి లేవగలను. లేస్తూనే ఉంటా'' అంటూ తన ఫేస్ బుక్ ద్వారా ప్రకటించింది హీరోయిన్ భావన. ఈమె చేసిన పోస్టును ప్రముఖ మలయాళం స్టార్లు అందరూ కూడా షేర్లు చేస్తున్నారు. మొత్తానికి ఒక అగాయిత్యంతో భావన వంటి టాలెంటెడ్ అమ్మాయి లైఫ్‌ ను ఇరకాటంలో పడేద్దాం అనుకున్నా కూడా.. ఆమె వారందరికీ ఒంటి చేత్తో సమాధానం చెప్పినంత పని చేసింది.

ఇటువంటి బలాత్కారాలకు గురైన మహిళలందరికీ భావన ఆదర్శం. జరిగిన విషయాలను తలుచుకుంటూ కుంగిపోకుండా.. జీవితంలో ముందుకు దూసుకుపోవడం అసలైన విజయం మరియు కర్తవ్యం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/