Begin typing your search above and press return to search.

భావన ఎంగేజ్మంట్ అయిపోయిందోచ్

By:  Tupaki Desk   |   9 March 2017 12:56 PM GMT
భావన ఎంగేజ్మంట్ అయిపోయిందోచ్
X
ఒక వారం క్రితం మలాయళం క్యూటి భావనపై జరిగిన దాడి ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు. ఆమె కారును అడ్డగించి ఆమెను కొందరు నేరస్తులు వేధించిన సంగతి తెలిసిందే. పోలీస్ ఎఫ్పైర్ ప్రకారం భావన ను వివస్ర్తను చేసి సెమీ న్యూడ్ గా వీడియోలు తీశారని మలయాళం మీడియా ప్రచురించింది. అయితే భావన ఈ సంఘటన నుండి కోల్కోవడానికి చాలా టైమ్ పడుతుందని అనుకుంటే.. అమ్మడు నాలుగు రోజుల్లో తిరిగి షూటింగ్ కు వచ్చేసింది. కట్ చేస్తే ఇప్పుడు మరో షాకిచ్చింది చూడండి.

లైంగిక వేధింపులు జరిగితే కలకలాం డోర్లు మూసుకుని ఇంట్లో కూర్చవక్కర్లేదు. వెంటనే ఆ దాడిని లీగల్ గా ఎదుర్కుంటూ సాధారణ జీవితం గడిపేయవచ్చు అంటూ ఇప్పుడు భావన అందరికీ ప్రేరణ ఇస్తోంది. గతంలో తాను చేసిన రోమియో సినిమా ప్రొడ్యూసర్ తో భావన చాలా కాలంగా ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. ఇప్పుడు నవీన్ అనే ఆ ప్రొడ్యూసర్ తో ఈరోజు సింపుల్ గా తన సన్నిహితులు స్నేహితులు బంధువుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకుంది భావన. వచ్చే ఆగస్టులో పెళ్ళి జరగనుందట.

కంగ్రాట్స్ భావన అండ్ భావన!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/