Begin typing your search above and press return to search.
భావన కిడ్నాప్ కు ముందు ఏం జరిగింది?
By: Tupaki Desk | 19 Feb 2017 9:53 AM GMTమలయాళ హీరోయిన్ భావన ను కిడ్నాప్ చేసి కార్లో లైంగికంగా వేధించడం సౌత్ ఇండియా అంతటా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. భావన లాంటి సెలబ్రెటీకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భావన దగ్గర ప్రస్తుతం డ్రైవర్ గా పని చేస్తున్నవాడు.. ఇంతకుముందు డ్రైవర్ గా ఉన్నవాడు కలిసి ఇంత దారుణానికి ఒడిగట్టడం విస్మయం కలిగిస్తోంది. తర్వాతి పరిణామాలు ఆలోచించకుండా భావనను కిడ్నాప్ చేయబోవడం.. రెండు గంటల పాటు కార్లో ఆమెపై లైంగికంగా తీవ్ర వేధింపులకు పాల్పడటం ఆశ్చర్యకరం. అదృష్టవశాత్తూ వీరి బారి నుంచి తప్పించుకున్న భావన.. పోలీసులకు నిందితుల గురించి వివరాలు ఇవ్వడంతో ప్రస్తుత డ్రైవర్ మార్టిన్.. మాజీ డ్రైవర్ సునీల్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇంకో ఏడుగురు అనుమానితుల్ని అరెస్టు చేశారు.
పోలీసుల విచారణలో కొన్ని ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. ఈ సంఘటన జరగడానికి ముందు మార్టిన్ డ్రైవర్ ఎప్పటికప్పుడు ఆమె మూమెంట్స్ గురించి మిగతా నిందితులకు అప్ డేట్స్ ఇస్తూ వచ్చాడని తేలింది. ఇరువురికీ మధ్య 40 ఫోన్ కాల్స్ నడిచాయి. అనేక ఎసెమ్మెస్ లు కూడా వెళ్లాయి. భావన త్రిసూర్ నుంచి కోచికి బయల్దేరిన సంగతి కూడా అవతలి వాళ్లకు తెలిసింది. వెంటనే మధ్యలో భావన కారును అటకాయించి.. ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ చేశారు. డ్రైవర్ మార్టిన్ భావన దగ్గర నమ్మకంగా కనిపిస్తూ.. నిందితులకు సహకరించాడు. వీళ్ల కారును నిందితులు టెంపోతో ఢీకొట్టి.. ఆ తర్వాత కార్లోకి చొరబడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో భావన మాజీ డ్రైవర్ సునీల్ కుమారే ప్రధాన నిందితుడని తేలింది. అతడిపై పలు కేసులున్నట్లు కూడా వెల్లడైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/