Begin typing your search above and press return to search.

ఆ లెక్కన భావన రిటైర్ అయినట్లేగా

By:  Tupaki Desk   |   24 Feb 2017 11:12 AM GMT
ఆ లెక్కన భావన రిటైర్ అయినట్లేగా
X
నటి భావనపై కారులో దాడి జరిపి.. ఆమెను ఇబ్బందికరమైన పొజిషన్లో ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం.. వగైరా అంశంలో ఇప్పుడు కొంతమందిని ఆల్రెడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తం యవ్వారంలో కొందరు పెద్దల హస్తం ఉందనేది ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన అంశం. అయితే ఇప్పుడు ఇదే విషయంపై భావన ఒక బోల్డ్ డెసిషన్ తీసుకుంది.

తనపై దాడికి సంబంధించిన దోషులందరినీ అరెస్టు చేసి.. వారికి శిక్షను ఖరారు చేసే వరకు.. అమ్మడు తిరిగి కెమెరా ముందుకు వచ్చి నటించని అని తేల్చి చెప్పేసింది. వచ్చే నెలలో అమ్మడు ఒక ప్రొడ్యూసర్ ను వివాహమాడాలి కాని.. ఓ నాలుగైదు సినిమాలను మాత్రం ఒప్పేసుకుంది. అయితే ఈ దాడి దృష్ట్యా తాను ఆ దోషులకు శిక్ష పడ్డాకే సినిమాల్లోకి తిరిగి వస్తానని శపథం చేయడం.. ఆ సినిమాల నుండి తప్పుకోవడం.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు మన భారతదేశంలో లీగల్ వ్యవస్థ పనితీరును చూసుకుంటే.. నిజంగానే దోషులను పోలీసులు పట్టుకున్నా కూడా.. వారికి శిక్షపడ్డానికి మాత్రం ఓ పదేళ్ళు పట్టే ఛాన్సుంది. అలా చూసుకుంటే అప్పటివరకు భావన తిరిగి సినిమాల్లోకి రాదా? అంటే దాదాపు రిటైర్ అయిపోయినట్లేగా?

కాని భావన బోల్డ్ గా కెమెరా ముందుకు వచ్చి తనకు జరిగిన విషయం గురించి వివరించి.. దోషుల గురించి ఓపెన్ గా మాట్లాడేసి.. తిరిగి సినిమా షూటింగుల్లో కూడా పాల్గొంటే.. ఖచ్చితంగా అమ్మడి ధైర్యసాహసాల ఇతర బాధిత మహిళలకు కూడా చాలా ధైర్యాన్నిస్తాయేమో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/