Begin typing your search above and press return to search.

మరో క్లాసిక్ టైటిల్ ని ఏం చేస్తారో

By:  Tupaki Desk   |   10 Feb 2016 5:30 AM GMT
మరో క్లాసిక్ టైటిల్ ని ఏం చేస్తారో
X
పాత హిట్ సినిమా టైటిల్స్ ను తీసుకుని సినిమాలు తీసేయడం ఎప్పటి నుంచో ఉన్నా.. ఇప్పడది ట్రెండ్ గా మారిపోయింది. చరిత్రలో నిలిచిపోయిన సినిమాల టైటిల్స్ పెట్టుకుని.. ఉన్నట్లుండి క్రేజ్ సంపాదించేసుకునే ఐడియాలను వేస్తున్నారు నిర్మాతలు, దర్శకులు. సినీ అభిమానులు ఈ విషయంలో డిజప్పాయింట్ అవుతున్నా.. పాత సినిమా పేర్లను ఇష్టానుసారం ఉపయోగించుకోవడం మాత్రం ఆగడం లేదు.

ఈ ట్రెండ్ ని రీసెంట్ గా ప్రారంభించింది రైటర్ కోన వెంకట్. గీతాంజలి అనే టైటిల్ తో హారర్ కామెడీ తీయడం, అది కాస్తా నాలుగు డబ్బులు తేవడంతో.. ఏ మాత్రం ఆగకుండా ఈ సారి శంకరాభరణం అన్నాడు. సినిమానే కాదు.. పరువు కూడా పోగొట్టుకున్న పరిస్థితి వచ్చిందీయనకు. ఇప్పుడు మరో క్లాసిక్ మూవీ టైటిల్ ని భవ్య క్రియేషన్స్ రిజిస్టర్ చేయించింది. బాపు సినిమాల్లో తలమానికంగా నిలిచే ముత్యాల ముగ్గు టైటిల్ ని ఈ సంస్థ రిజిస్టర్ చేసింది. సాధారణంగా గోపీచంద్ హీరోగా సినిమాలు తీసే ఈ సంస్థ.. ముత్యాల ముగ్గును రిజిస్టర్ చేయడం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ అయింది.

ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ తప్ప.. డైరెక్టర్, హీరో వంటి మిగిలిన విషయాలను ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే.. అంతటి మహోన్నతమైన టైటిల్ ని.. ఇప్పటి ట్రెండ్ కి ఉపయోగించడం అంటే.. దాదాపుగా వాటిని అవమానించినట్లే అని ఫీలవుతున్నారు సినీ అభిమానులు. మూవీ మేకర్స్ మాత్రం.. ఇన్ స్టంట్ పబ్లిసిటీ కోసం.. ఆయా సినిమాల టైటిల్స్ ను ఇష్టానుసారం వాడేసుకుంటున్నారు.