Begin typing your search above and press return to search.

సంచలనం సృష్టిస్తున్న రాంచరణ్ అల్లూరి వీడియో..

By:  Tupaki Desk   |   28 March 2020 1:30 AM GMT
సంచలనం సృష్టిస్తున్న రాంచరణ్ అల్లూరి వీడియో..
X
మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఇచ్చిన డిజిటల్ వీడియో గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో రాంచరణ్ పోషిస్తున్న 'అల్లూరి సీతారామరాజు' పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ వీడియో కరోనా వైరస్ భయం నుండి టాలీవుడ్ - బాలీవుడ్ ప్రేక్షకులను బయట పడేస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే రాంచరణ్ అభిమానులను అంతలా ఆకట్టుకుంటుంది ఆ వీడియో. ఇప్పటికే సోషల్ మీడియాలో మోషన్ పోస్టర్ తో మెస్మరైజ్ చేసిన ఆర్ఆర్ఆర్ టీం ఈ వీడియోతో ప్రేక్షకులను ఇప్పటి నుండే కట్టిపడేస్తోంది.

'భీమ్ ఫర్ రామ్' పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ మరో హైలైట్. 'ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్టుంటాది.. కలబడితే వేగుసుక్క ఎగబడినట్టుంటాది.. ఎదురుపడితే సావుకైనా సెమట దారపడతాది.. బాణమైన బంధూకైనా వానికి బాంచన్ అయితది.. ఇంటిపేరు అల్లూరి సాకింది గోదారి.. నా అన్న మన్నెం దొర..' అనే డైలాగ్స్ ఎన్టీఆర్ వాయిస్ లో గూస్బంప్స్ కలిగిస్తాయి. ఎన్టీఆర్ వాయిస్ లో రాంచరణ్ ని చూపించిన విధానం సూపర్ అని చెప్పాలి. ఒక్కో డైలాగ్ కి ఒక్కో యాక్షన్ - చరణ్ శరీరాకృతి చూపుతిప్పుకోనివ్వవు. సినీ ప్రముఖుల నుండి ప్రశంసలను అందుకుంటున్న ఈ వీడియో ఇకపై ఎన్ని సంచలనాలకు దారి తీయనుందో.. మరి!