Begin typing your search above and press return to search.
రాజమౌళే స్ఫూర్తి అంటున్న సీనియర్ డైరెక్టర్
By: Tupaki Desk | 1 Feb 2016 7:38 AM GMTరాజమౌళి కంటే దాదాపు పదేళ్ల ముందు నుంచి దర్శకుడిగా ఉన్నాడు భీమనేని శ్రీనివాసరావు. అలాంటి దర్శకుడు తనకు రాజమౌళే స్ఫూర్తి అని.. అతడి ఇన్ స్పిరేషన్ తోనే సినిమాలు చేయగలుగుతున్నానని చెప్పడం విశేషం. 90ల్లో సుస్వాగతం, శుభాకాంక్షలు, సూర్యవంశం లాంటి సూపర్ హిట్ రీమేకులతో సెన్సేషన్ క్రియేట్ చేసిన భీమనేని శ్రీనివాసరావు.. కొత్త శతాబ్దంలో మాత్రం వెనకబడిపోయాడు. రీమేకులు కలిసి రాలేదు. నేరుగా తీసిన సినిమాలూ ఆడలేదు. అయితే చాలా గ్యాప్ తీసుకుని ఆయన చేసిన తమిళ రీమేక్ ‘సుడిగాడు’ ఆయన్ని మళ్లీ ట్రాక్ మీదకి తెచ్చింది. ఇప్పుడు మరోసారి తమిళ రీమేక్ ను నమ్ముకుని ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు భీమనేని. ‘సుందర పాండ్యన్’కు రీమేక్ గా తెరకెక్కిన ‘స్పీడున్నోడు’ ఈ శుక్రవారమే విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలో భీమనేని మాట్లాడుతూ తనకు రాజమౌళితో పాటు మరో దర్శకుడు స్ఫూర్తిగా నిలుస్తున్నాడని చెప్పాడు. ‘‘మంచి కథలను ఎంపిక చేసుకుని సినిమా చేయడానికి సమయం పడుతుంది. అందువల్లే రెండు మూడేళ్ళకు ఒక సినిమా చేయాల్సి వస్తుంది. నేను పడుతూ, లేస్తూ సినిమాలు చేస్తూ వచ్చాను. నేను ఇప్పటి ట్రెండుకి, టెక్నాలజీకి సరిపోయే విధంగా సినిమా తీశానని చెప్పడానికి సమాధామనే ఈ చిత్రం. నేను ఇలా అప్ డేట్ కావడానికి రాజమౌళి - రాజ్ కుమార్ హిరాణిలే కారణం. ఫుల్ ఎఫర్ట్ పెట్టి తీస్తే సినిమా తెలుగు సినిమాను హాలీవుడ్ రేంజికి తీసుకెళ్లొచ్చని రాజమౌళి రుజువు చేశాడు. రేపు నా సినిమా చూసి నా పిల్లలు గర్వపడేలా ఉండాలని అనుకుంటున్నాను. ఆ లక్ష్యంతోనే సినిమాలు తీస్తున్నాను’’ అని చెప్పాడు భీమనేని. మొత్తానికి భీమనేని లాంటి సీనియర్లకు కూడా స్ఫూర్తినిస్తున్నాడన్నమాట జక్కన్న.