Begin typing your search above and press return to search.
రవితేజ, సునీల్ వద్దన్నది నిజమే
By: Tupaki Desk | 2 Feb 2016 3:30 PM GMTసుందర పాండ్యన్... దాదాపు మూడేళ్ల కిందటే టాలీవుడ్ లో ఈ పేరు వినిపించింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి హక్కులు తీసుకున్న భీమనేని శ్రీనివాసరావు రవితేజ సహా చాలామంది హీరోల్ని సంప్రదించాడని.. ఆ హీరోలెవ్వరూ ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదని వార్తలొచ్చాయి. చివరికి బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా మొదలుపెట్టి పూర్తి చేశాడు భీమనేని. ఈ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన భీమనేని... ‘సుందరపాండ్యన్’ రీమేక్ కోసం రవితేజ సహా కొంతమంది హీరోల్ని సంప్రదించిన మాట వాస్తవమేనని వెల్లడించాడు. సినిమా ఆలస్యం కావడానికి కూడా అదే కారణమని తెలిపాడు.
‘‘సుందర పాండ్యన్ చూడగానే సినిమా చాలా బాగా నచ్చేసి రీమేక్ రైట్స్ తీసుకున్నాను. ఈ కథకు రవితేజ కరెక్టుగా సరిపోతాడనిపించింది. ముందు రవితేజను, ఆ తర్వాత సునీల్, మరో ముగ్గురు నలుగురు హీరోలను కలిశాను. వాళ్లకెందుకో ఈ సబ్జెక్ట్ కనెక్ట్ కాలేదు. నేను చూసే కోణంలో వాళ్లు సినిమాను చూడలేదనుకుంటాను. చివరికి బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా ఓకే అయింది. నిజానికి ఈ సినిమాకు అనుభవం ఉన్న హీరో కావాలి. కానీ ఒక సినిమా మాత్రమే చేసిన శ్రీనివాస్ ఈ పాత్రను చాలా బాగా చేశాడు. అనుభవమున్న హీరోలాగే నటించాడు. తొలి సినిమాతో డ్యాన్సులు, ఫైట్లలో ప్రతిభ చూపించిన శీను.. ఈ సినిమాతో నటుడిగానూ నిరూపించుకుంటాడు. అతడికి గొప్ప భవిష్యత్తుంది. మంచి హీరోకు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి’’ అని భీమనేని చెప్పాడు.