Begin typing your search above and press return to search.
మంచి సీన్స్ ని మిస్ చేశావ్ భీమ్లా..!
By: Tupaki Desk | 26 Feb 2022 12:30 PM GMTమలయాళంలో ఘనవిజయం సాధించిన 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' చిత్రాన్ని ''భీమ్లా నాయక్'' గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ బిజూ మీనన్ - పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించారు. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మలయాళ రీమేక్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని 'భీమ్లా నాయక్' లో చాలానే మార్పులు చేశారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో పాటుగా పాటలు జత చేశారు. ఒరిగినల్ వెర్షన్ కాస్త స్లోగా సాగుతుంది.. ఇక్కడ మాత్రం గ్రిప్పింగ్ గా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లేని రాసుకున్నారు. సినిమా చూసిన వాళ్ళకి తేడాలు స్పష్టంగా తెలుస్తాయి.
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ - రాజకీయ నేపథ్యం ఉన్న మాజీ సైనికాధికారి మధ్య ఆత్మాభిమానం - అహంకారం నేపథ్యంలో జరిగిన వైరాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్టులో చేసిన మార్పులు చాలా వరకు అభిమానులను మెప్పించాయి. అయితే అక్కడ హైలైట్ గా నిలిచిన రెండు మూడు సీన్స్ ని తీసుకోకపోవడం వారిని నిరాశ పరిచింది.
'అయ్యప్పనుమ్ కొశీయుమ్' చిత్రంలో బిజూ మీనన్ - పృథ్వీరాజ్ పాత్రలు పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్లు ఉంటాయి. ఓ సన్నివేశంలో బిజూ బస్సు దిగి నడుచుకుంటూ.. లుంగీ పైకి ఎగ్గట్టి.. చెప్పులు రోడ్డు మీద వదిలి.. అడ్డొచ్చిన రౌడీని చితక్కొడతాడు. అక్కడే ఉన్న ప్రొక్లయిన్ తో ఓ ఇంటిని కూల్చేస్తాడు. ఇదంతా పృథ్వీరాజ్ సమక్షంలోనే జరుగుతుంది.
ఈ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. దీనికి జేక్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సోషల్ మీడియాలో ఈ మ్యూజిక్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ బీట్ తోనే భీమ్లా నాయక్ సినిమాలో 'లాలా భీమ్లా' అనే పాటను కంపోజ్ చేశారు. అయితే హీరోయిజాన్ని మరింతగా ఎలివేట్ చేసే ఈ సన్నివేశాన్ని తెలుగులో ఉపయోగించుకోలేదు.
అలానే ఒరిగినల్ వర్సన్ లో ఓ సీన్ లో పృథ్వీరాజ్ కారు చెడిపోతుంది. అడవి మార్గంలో నడుచుకుంటూ వస్తున్న అతనికి ఎవరూ లిఫ్ట్ ఇవ్వరు. దీంతో నడిచి నడిచి అలిసిపోయి కళ్ళు తిరిగి పడిపోయే స్థితిలో ఉంటాడు. అలాంటి టైంలో బిజూ బైక్ పై అటుగా వస్తూ.. శత్రుత్వాన్ని పక్కన పెట్టి లిఫ్ట్ ఇస్తాడు. ఇద్దరూ కలిసి ఒకే బైక్ పై వెళ్తున్న సందర్భంలో బిజూ మెడపై పృథ్వీరాజ్ కత్తి పెట్టే సన్నివేశం బాగా పండింది. తెలుగులో ఈ సీన్ లేదు.
అయితే పవన్ కళ్యాణ్ - రానా కలిసి ఒకే బండిపై వెళ్లే సీన్ 'భీమ్లానాయక్' పోస్టర్లలో కనిపించింది. కానీ సినిమాలో మాత్రం కట్ చేశారు. ఇలాంటి ఈ సన్నివేశాన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం వాడుకున్నారు. ఇకపోతే పవన్ - నిత్యా మీనన్ మధ్య సాగిన 'అంత ఇష్టం' పాట సినిమాలో లేనందుకు ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. లిరికల్ వీడియో విశేషంగా ఆకట్టుకోవడంతో విజువల్ గా కూడా బాగుంటుందని అందరూ ఎక్సపెక్ట్ చేసారు. కానీ మూవీలో ఈ సాంగ్ లేకుండా ఎడిట్ చేశారు.
ఒరిగినల్ వర్సెన్ తో పోల్చుకుంటే 'భీమ్లానాయక్' లో భారీ మార్పులే చేశారు. అవి ఫ్యాన్స్ ని మెప్పించినప్పటికీ.. కొన్ని మంచి సీన్స్ - సాంగ్ మిస్సయ్యాయనే బాధ మాత్రం ఉంది. ఒకవేళ ఎడిటింగ్ లో లేపేసి ఉంటే.. రాబోయే రోజుల్లో మళ్లీ యాడ్ చేసి ఖుషీ చేస్తారేమో చూడాలి.