Begin typing your search above and press return to search.
బరిలో నిలిచేది ఒక్క మెగా హీరోనే..!
By: Tupaki Desk | 17 Feb 2022 1:30 PM GMTటాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మళ్ళీ క్రేజీ చిత్రాల మధ్య క్లాష్ ఏర్పడే పరిస్థితి వచ్చింది. కరోనా నేపథ్యంలో ఇన్నాళ్ళూ వాయిదా పడుతూ వచ్చిన సినిమాలన్నీ.. ఈ మధ్య వరుసగా విడుదల తేదీల మీద కర్చీఫ్స్ వేస్తూ వచ్చారు.
ఫైనల్ గా బరిలో ఎవరు దిగుతారో క్లారిటీగా తెలియనప్పటికీ.. అందరూ ఒకటికి రెండు డేట్లను బ్లాక్ చేసి పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మహాశివ రాత్రి ఫెస్టివల్ వీక్ లో అర డజను సినిమాల విడుదలలు ప్రకటించబడ్డాయి.
కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ - టాలీవుడ్ యువ హీరో కార్తికేయ కలిసి నటించిన 'వలిమై' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్రవరి 24న రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
అలానే అలియా భట్ చేసిన పాన్ ఇండియా మూవీ 'గంగూబాయి కతియావాడి' ఫిబ్రవరి 25న పలు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. అదే రోజున 'భీమ్లా నాయక్' తో పాటుగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' 'గని' 'స్టెబాస్టియన్' వంటి సినిమాలు రాబోతున్నట్లు ప్రకటించుకున్నారు.
రెండు పాన్ ఇండియా సినిమాలు పక్కన పెడితే.. మిగతా నాలుగిట్లో బరిలో ఏయే చిత్రాలు నిలుస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మెగా హీరోలు నటించిన రెండు సినిమాలు పోటీ పడే అవకాశం ఉందనేది చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' చిత్రాన్ని ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో.. వరుణ్ తేజ్ 'గని' సినిమా కోసం ఫిబ్రవరి 25 మరియు మార్చి 4వ తేదీలను అనౌన్స్ చేసారు.
మొన్నటి వరకు 'భీమ్లా' సైలెంట్ గా ఉండటంతో 'గని' ని ఫిబ్రవరి 25న దించాలని ఫిక్స్ అయిన మేకర్స్.. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ ఎత్తేయడంతో పాటుగా 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి రావడంతో సడన్ గా పవన్ కళ్యాణ్ సినిమా డేట్ ని అనౌన్స్ చేసారు. దీంతో మిగతా సినిమాలతో పాటుగా 'గని' కి ఇబ్బంది ఏర్పడింది.
సాధారణంగా సినిమాల మధ్య క్లాష్ ని నివారించడానికి నిర్మాతలు అందరూ మాట్లాడుకొని, ఓ అభిప్రాయానికి వచ్చి రిలీజ్ డేట్స్ ఇస్తుంటారు. కానీ ఇక్కడ ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన హీరోలు.. అందులోనూ బాబాయ్ - అబ్బాయ్ సినిమాల విడుదల విషయంలో గందరగోళం ఏర్పడటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
'భీమ్లా నాయక్' సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో. 'గని' చిత్రంలో హీరో వరుణ్ తేజ్ అయితే సమర్పకులు అల్లు అరవింద్.. నిర్మాత అల్లు బాబీ. ఇలా మెగా కాపౌండ్ కి చెందిన వారి సినిమాలు ఒకే రిలీజ్ డేట్ ఇవ్వడంతో 'అల్లు వర్సెస్ మెగా' అనే విధంగా ఉంటుందని కామెంట్స్ వచ్చాయి. దీన్ని నివారించడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
మెగా ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీ పెద్దలు ఈ క్లాష్ ని పరిష్కరించేందుకు రంగంలోకి దిగారని టాక్ వినిపిస్తోంది. ఫిబ్రవరి 25వ తేదీన బాక్సాఫీస్ వద్ద ఒక్క మెగా హీరో మాత్రమే ఉండేలా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి తుది ప్రకటన వెలువడనుందని సమాచారం. ఎక్కువ శాతం 'గని' సినిమాని వాయిదా వేసి.. మార్చి 4న థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.
మరోవైపు ఇప్పటికే ప్రమోషన్స్ చేసేసుకున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మేకర్స్ మాత్రం ప్రస్తుతానికైతే ఈ నెల 25నే రానున్నట్లు చెబుతున్నారు. పవన్ సినిమా ఉన్నప్పటికీ.. దానికి పూర్తిగా భిన్నమైన జోనర్ లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవడంతో ప్రేక్షకాదరణ దక్కుతుందని భావిస్తున్నారట. ఇక 'స్టెబాస్టియన్' సినిమా మాత్రం వెనక్కి వెళ్లిపోయింది. మరో మంచి డేట్ ని బ్లాక్ చేయాలని చూస్తున్నారు.