Begin typing your search above and press return to search.

యూఎస్ లో భీమ్లా వసూళ్ళు ఎలా ఉన్నాయంటే..?

By:  Tupaki Desk   |   25 Feb 2022 11:21 PM IST
యూఎస్ లో భీమ్లా వసూళ్ళు ఎలా ఉన్నాయంటే..?
X
పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం పాజిటివ్ రివ్యూలు అందుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహా శివరాత్రి పండుగ కూడా ఈ మూవీ వసూళ్లకు కలిసి రానుంది.

'భీమ్లా నాయక్' సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌ లో కూడా మంచి ఆదరణ పొందుతోంది. ప్రీమియర్ షోల నుండే పవన్ మూవీ 858K డాలర్లు కలెక్ట్ చేసి యూఎస్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

దీంతో టాప్-10 యుఎస్ ప్రీమియర్ నంబర్స్ లోకి ప్రవేశించింది. 'సైరా నరసింహా రెడ్డి' 'అల వైకుంఠపురములో' 'భరత్ అనే నేను' వంటి చిత్రాల తర్వాత ఏడవ స్థానంలో పవన్ చిత్రం నిలిచింది.

ఇటీవల కాలంలో ప్రీమియర్స్ ద్వారా ఈ స్థాయి వసూళ్ళు రాబట్టిన సినిమా 'భీమ్లా నాయక్' అనే చెప్పాలి. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి కాబట్టి.. రాబోయే రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. పాండమిక్ వల్ల బాగా దెబ్బతిన్న యూఎస్ మార్కెట్.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. మరి పవన్ సినిమా 2 మిలియన్ల డాలర్లకు పైగా కలెక్ట్ చేసి మళ్లీ ఓవర్ సీస్ బాక్సాఫీస్ కు ఊపిరి పోస్తుందేమో చూడాలి.

కాగా, 'భీమ్లా నాయక్' చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటుగా రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించారు. నిత్యా మీనన్ - సంయుక్త మీనన్ హీరోయిన్లుగా కనిపించారు. సాగర్ కె. చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.