Begin typing your search above and press return to search.

రెండోరోజు మూడో రోజూ భీమ్లా హ‌వా

By:  Tupaki Desk   |   27 Feb 2022 12:40 PM GMT
రెండోరోజు మూడో రోజూ భీమ్లా హ‌వా
X
క్రైసిస్ కాలంలో ఆవురావురుమంటూ ఎదురు చూసిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు థియేటర్ల‌లో త‌మ హ‌వా చూపిస్తున్నారు. తాజా స‌మాచారం మేర‌కు తొలి మూడురోజుల్లోనే వ‌ర‌ల్డ్ వైడ్ భీమ్లా నాయక్ 100కోట్ల క్ల‌బ్ లో చేరుతోంద‌ని టాక్ వినిపిస్తోంది.

మొద‌టి రోజు అడ్వాన్స్ బుకింగుల‌తో సంచ‌ల‌న వ‌సూళ్ల‌ను సాధించిన భీమ్లా తెలుగు రాష్ట్రాలు స‌హా అమెరికాలోనూ చ‌క్క‌ని ఫిగ‌ర్స్ ని న‌మోదు చేశాడు. రెండవ రోజు భీమ్లా నాయక్ హౌస్ ఫుల్స్ తో అంతటా సంచలనం సృష్టించింది. నైజాం నుంచి ఆంధ్రా.. అమెరికా వరకు భీమ్లా హ‌వాకు ఎదురే లేద‌ని తెలుస్తోంది. వ‌సూళ్ల ప‌రంగా గొప్ప స్థిరత్వం కనిపించింది. మూడవ రోజు అద్భుత వ‌సూళ్ల‌తో ప్రారంభమైనందున వీకెండ్ ధ‌మాకా మోగ‌నుంది. భీమ్లా నాయక్ అన్నిచోట్లా అనూహ్యంగా రాణిస్తున్నాడు. అయితే నైజాం - యుఎస్ లో సంఖ్యలు అద్భుతంగా ఉన్నాయి.

ఏపీలో టికెట్ పంచ్ ప్ర‌భావం

నిజానికి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ అసాధార‌ణంగా ఉన్నా కానీ నైజాంలో ఉన్న వ‌సూళ్లు ఏపీలో లేనేలేవు. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల వ‌సూళ్లు అంతంత మాత్ర‌మే. థియ‌ట‌ర్ల నిండుగా జ‌నం ఉన్నప్పటికీ టిక్కెట్ ధరల కారణంగా తుది సంఖ్యలు తక్కువగా ఉన్నాయి. రానున్న రోజుల్లో యూఎస్ ఏ- నైజాం ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతాయి. భీమ్లా నాయక్ కి మౌత్ టాక్ పెద్ద ప్ల‌స్ అని విశ్లేషిస్తున్నారు. ఈ మూవీ చూసిన వారెవ‌రూ బాలేదు అని మాత్రం అన‌లేదు.

వారం రోజులు స‌న్నివేశ‌మేంటో?
తొలి మూడురోజుల్లో సుమారు 100కోట్ల వ‌సూళ్ల‌తో భీమ్లా అద‌ర‌గొడుతుంద‌న్న ప్ర‌చారం న‌డుమ‌.. అసలు పరీక్ష మొదటి సోమవారం ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ అంత సులువేమీ కాదు. ఆశించిన మార్క్ కి చేరువ కావాలంటే రెండు వారాలు ఆడాల్సి ఉంటుంది.

కొనుగోలు ధరలో తగ్గింపు ఉన్నప్పటికీ ఈ స‌న్నివేశం ఉంది. ప్రస్తుత ట్రెండ్ ఆధారంగా నెల్లూరుకు ఇక్కడ బ్రేక్ ఈవెన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఏరియాలో మూడవ రోజు వ‌సూళ్లు ఘ‌నంగా ఉన్నాయ‌ని తెలిసింది. భీమ్లా నాయక్ కి ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద బాగా వ‌ర్క‌వుటైంది. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే యాభై కోట్లకు పైగా వస్తుందని అంచనా.

అమెరికాలోనూ భీమ్లా హ‌వా సాగుతోంది. ఏపీలో టికెట్ ధ‌ర‌ల వ‌ల్ల త‌క్కువ క‌లెక్ష‌న్లు ఉన్నా ఎక్కువ రోజులు ఆడితే ఇక్క‌డ బ్రేక్ ఈవెన్ కి ఆస్కారం ఉంటుంద‌ని అంచ‌నా. ఈగోయిస్టిక్ పెద్ద మ‌నిషితో ఆత్మ‌విశ్వాసం ఉన్న పోలీసాఫీస‌ర్ పోరాటం ఎలా సాగింద‌న్న‌దే భీమ్లా నాయ‌క్ సినిమా. అందుకే టైటిల్ లో భీమ్లా ను హైలైట్ చేశారు. ఇక‌పోతే ఇందులో ప‌వ‌న్ .. రానా ఇరువురు పోటాపోటీగా న‌టించార‌న్న ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. త్రివిక్ర‌మ్ పంచ్ లు సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ భీమ్లాకు ప్ర‌ధాన బ‌లంగా మారాయి.