Begin typing your search above and press return to search.
సంక్రాంతి రేసు నుంచి భీమ్లా నాయక్ తప్పుకున్నట్లే
By: Tupaki Desk | 5 Nov 2021 4:32 AM GMTతెలుగు వారికి పెద్ద పండుగ.. ఇప్పటికి మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగకు ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. తెలుగు వారికి ఎన్ని పండుగలు ఉన్నా.. సంక్రాంతి మాత్రం సో స్పెషల్. అందుకు.. ఆ ప్రత్యేకతకు తగ్గట్లే.. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన సినిమాలు కూడా పెద్ద ఎత్తున విడుదల అవుతుంటాయి. సంక్రాంతి రేసులోకి వచ్చేందుకు అగ్రహీరోలంతా ఆరాటపడుతుంటారు. కనీసం రెండు నుంచి నాలుగు సినిమాల వరకు విడుదల అవుతుంటాయి. సంక్రాంతికి రెండు వారాల ముందు నుంచి సినిమాల జోరు షురూ అవుతుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. వచ్చే సంక్రాంతికి గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలు పోటెత్తటం తెలిసిందే. పోటాపోటీగా రిలీజ్ డేట్లను ప్రకటించిన అగ్రహీరోల సినిమాలు.. నెమ్మదిగా సంక్రాంతి పోరు నుంచి తప్పుకోవటం గమనార్హం. ఇప్పటికే మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీని జనవరి 13న థియేటర్లకు తెస్తామని చెప్పినా.. దాని రిలీజ్ డేట్ మారి ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించటం తెలిసిందే.
మరోవైపు పవన్ కల్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ జనవరి 12వ తేదీన రిలీజ్ ప్రకటించారు. డార్లింగ్ ప్రభాస్ రాధేశ్యామ్ ను జనవరి 14న విడుదల చేయటానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాల విడుదలకు వారం ముందే అంటే.. జనవరి 7న దర్శక ధీరుడు రాజమౌళి నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేసేందుకు వీలుగా భారీగా ప్లాన్ చేయటం తెలిసిందే.
ఇంత భారీగా ప్లాన్ చేసిన వేళ.. ఆ మూవీతో తమ మూవీ క్లాష్ కాకూడదన్న ఆలోచనతో సర్కారు వారి పాట పక్కకు వెళ్లిపోతే.. తాజాగా పవన్ కల్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ కూడా అదే బాటను పట్టినట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా.. దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ లో సినిమా విడుదలను చెప్పే డేట్ లేకపోవటంతో కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కోసమే పవన్ తన మూవీ రిలీజ్ ను వాయిదా వేసుకునేందుకు ఓకే చెప్పారని.. ఆ విషయాన్ని సూటిగా చెప్పకుండా.. పోస్టర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. ఆర్ఆర్ఆర్ కు అన్ని మంచి శకునాలేనని చెప్పక తప్పదు.