Begin typing your search above and press return to search.
థమన్ - త్రివిక్రమ్ ని ట్రోల్ చేస్తున్న భీమ్లా ఫ్యాన్స్..!
By: Tupaki Desk | 22 Feb 2022 6:31 AM GMTపవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ''భీమ్లా నాయక్''. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా నుంచి సోమవారం రాత్రి థియేట్రికల్ ట్రైలర్ వచ్చింది. అందరూ ఊహించినట్లుగానే విడుదలైన కొన్ని గంటల్లోనే వ్యూస్ - లైక్స్ పరంగా నెట్టింట భీమ్లా ట్రైలర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 8.6 మిలయన్లకు పైగా వ్యూస్.. 1 మిలియన్ లైక్స్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అదే సమయంలో ఈ ట్రైలర్ పై ఓ వర్గం పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందినట్లు తెలుస్తోంది.
'భీమ్లా నాయక్' ట్రైలర్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ అస్సలు బాగాలేదని.. చాలా నీరసంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. పవన్ సినిమా నుంచి ఇలాంటి ట్రైలర్ ఎక్సపెక్ట్ చేయలేదని.. చివరి నిమిషంలో హడావిడిగా సౌండ్ మిక్సింగ్ చేసిన వదిలిట్లుగా ఉందని అభిమానులు అంటున్నారు. మ్యూజిక్ బాగుంటే ట్రైలర్ దద్దరిల్లిపోయేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
భీమ్లా సినిమాకు మొదటి నుంచీ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం అంచనాలను అందుకునేలా ట్రైలర్ ను కట్ చేయలేదని ట్రోల్ చేస్తున్నారు. నిజానికి 'గ్లింప్స్ ఆఫ్ భీమ్లా నాయక్' కోసం థమన్ కంపోజ్ చేసిన బీజీఎమ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. సాంగ్స్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కానీ ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ కు మాత్రం థమన్ చాలా డల్ బీజీఎమ్ ఇచ్చారని పవన్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.
'భీమ్లా నాయక్' సినిమాని ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అంటే పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు ఇంక మూడు రోజులు మాత్రమే ఉంది. మరో రెండు రోజుల్లో యూఎస్ ప్రీమియర్స్ పడతాయి. ఆల్రెడీ దాదాపు అన్ని ఏరియాలలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు 'భీమ్లా నాయక్' ట్రైలర్ చూస్తుంటే ఏదో హడావిడిగా సౌండ్ మిక్సింగ్ చేసినట్లు అనిపిస్తోంది. సినిమా కూడా ఇలాగే ఉంటుందేమో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్ ఉన్న థమన్ ఈ సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించలేదా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే థమన్ మాత్రం ట్రైలర్ చూసి ఓ అంచనాలు రావద్దని అంటున్నారు. మంగళవారం ఉదయం ట్వీట్ చేస్తూ.. ''ఫిబ్రవరి 25న థియేటర్లలో భీమ్లా నాయక్ ర్యాంప్ అమ్మా.. అన్నీ ట్రైలర్ లోనే ఎక్సపెక్ట్ చేస్తే ఎలా.. ఫారెస్ట్ ఫైర్ కి లోకల్ ఫైర్ కు తేడా ఉండాలిగా.. కలుద్దాం'' అని తమన్ పేర్కొన్నారు. మరి సంగీత దర్శకుడు చెప్పినట్లు సినిమాలో బీజీఎమ్ ఫ్యాన్స్ ని ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.
మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు తెలుగు రీమేక్ గా 'భీమ్లా నాయక్' సినిమా రూపొందింది. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు - స్ర్కీన్ ప్లే అందించారు. ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించగా.. ఆయనకు జోడీగా నిత్యా మీనన్ కనిపించనుంది. అలానే రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు. సముద్రఖని - బ్రహ్మానందం - రావు రమేష్ - మురళీ శర్మ - రఘుబాబు - నర్రా శ్రీను - కాదంబరి కిరణ్ - చిట్టి - పమ్మి సాయి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
'భీమ్లా నాయక్' చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా.. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేయగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.